Moviesస‌మంత‌ కొత్త దుకాణం తెరిచిందే... ఈ బోల్డ్ పాత్ర వెన‌క వాళ్లే...

స‌మంత‌ కొత్త దుకాణం తెరిచిందే… ఈ బోల్డ్ పాత్ర వెన‌క వాళ్లే ఉన్నారా ?

సౌత్ సినిమాను ప‌దేళ్ల‌కు పైగా ఏలేసింది స‌మంత‌. ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళంలోనూ వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టింది. అలాంటి స‌మంత త‌న నాలుగేళ్ల ప్రేమ‌ను సాకారం చేసుకుంటూ అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడింది. ఎంతో రంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వీరి పెళ్లి మ‌రో నాలుగేళ్ల‌కే పెటాకులు అయిపోయింది. స‌మంత – చైతు విడిపోయి అప్పుడే ఆరు నెల‌లు అవుతోంది. ఇంకేముంది.. స‌మంత ఫ్రీ బ‌ర్డ్‌. త‌న‌కు స్వేచ్ఛ‌గా విహారించుకునే హ‌క్కు కూడా ఉంది.

విడాకుల త‌ర్వాత స‌మంత మ‌రింత‌గా రెచ్చిపోతోంది. పుష్ప‌లో ఐటెం సాంగ్ చూస్తూనే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత కూడా ఆమె బోల్డ్ ఆఫ‌ర్ల‌కు ఓకే చెప్పేస్తోంది. గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం షూటింగ్ పూర్తి చేసిన స‌మంత‌.. ఇప్పుడు య‌శోద అనే మ‌రో థ్రిల్ల‌ర్ సినిమాలో న‌టిస్తోంది. ఇక కోలీవుడ్‌లో కార్తీ హీరోగా ఓ సినిమాకు సైన్ చేసింది. ఇటు బాలీవుడ్‌లో రెండు హాట్ వెబ్ సీరిస్‌ల‌తో పాటు హాలీవుడ్ సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫొటో షూట్ కూడా ఇటీవ‌ల పూర్త‌య్యింది.

ఇదిలా ఉంటే స‌మంత విడాకుల త‌ర్వాత హైద‌రాబాద్ గ‌చ్చిబౌలీలో ఓ ప్లాట్ కొనుక్కుంద‌న్న టాక్ వ‌చ్చింది. ఆ ప్లాట్లోనే ఆమె ఉంటుంద‌ని కూడా అంటున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో వెబ్ సీర‌స్‌ల‌కు ఓకే చెప్ప‌డంతో పాటు అక్క‌డ వ‌రుస‌గా న‌టించే ప్లాన్‌లో ఉన్న స‌మంత ఓ ఖ‌రీదైన అపార్ట్‌మెంట్ కూడా కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్లాట్ ధ‌ర రు. 5 కోట్లు అని స‌మాచారం.

బాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్ల‌పై క‌న్నేసే స‌మంత అక్క‌డ ఓన్ ప్లాట్ కొనుక్కుంద‌నే తెలుస్తోంది. స‌మంత మ‌రీ ఇంత బోల్డ్‌నెస్ ఆఫ‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్స్ ఇవ్వ‌డం వెన‌క ఆమె స‌న్నిహితులే ఎక్కువుగా ఉంటున్నార‌ని… వారి డైరెక్ష‌న్‌లోనే ఇప్పుడు స‌మంత న‌డుస్తోంద‌న్న పుకార్లు కూడా కోడై కూస్తున్నాయి. మ‌రి స‌మంత ఈ కొత్త ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news