MoviesRGV ఏంది ఈ ర‌చ్చ‌.. నైనా గంగూలీ, అప్స‌రా రాణి లిప్‌కిస్‌లు......

RGV ఏంది ఈ ర‌చ్చ‌.. నైనా గంగూలీ, అప్స‌రా రాణి లిప్‌కిస్‌లు… ఘాటు రొమాన్స్ (వీడియో)

కాంట్ర‌వ‌ర్సీ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ డేంజ‌ర‌స్ అనే లెస్బియ‌న్ క్రైం థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ లెస్బియ‌న్ క్రైం థ్రిల్ల‌ర్‌లో ఇద్ద‌రు హాట్ హీరోయిన్లు నైనా గంగూలీ, అప్స‌రా రాణి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. పైగా వ‌రుణ్ తేజ్ గ‌ని సినిమాకు పోటీగా అదే రోజు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 8న ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోంది. తెలుగులో మా ఇష్టం పేరుతో వ‌స్తోన్న ఈ సినిమాను హిందీ – తమిళం – కన్నడ – మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్ప‌క‌నే చెప్పేశాయి. ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆర్జీవీ త‌న ఇద్ద‌రు హాట్ హీరోయిన్ల‌ను వెంటేసుకుని దేశం అంత‌టా ఓ రేంజ్‌లో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాడు. వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో పాటు సోష‌ల్ మీడియాలోనూ సంద‌డి మామూలుగా లేదు. మ‌ధ్య‌లో త్రిబుల్ ఆర్ సినిమా ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చి మ‌రీ త‌న సినిమా ప్ర‌మోష‌న్ల‌కు వాడేసుకుంటున్నాడు.

త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్ద‌రు పెద్ద హీరోలు ఉంటే.. త‌న సినిమాలో ఇద్ద‌రు క‌త్తిలాంటి హీరోయిన్లు ఉన్నారంటూ గొప్ప‌గా చెప్పుకుంటున్నాడు. ఈ డేంజ‌ర‌స్ టీం ఇప్ప‌టికే ఢిల్లీ – బెంగళూరు – చెన్నై – కలకత్తా – హైదరాబాద్ వంటి నగరాలలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌మోష‌న్ల‌ను హీటెక్కించేస్తోంది. నైనా, అప్స‌ర ఫొటోలు, వీడియోలు చూస్తుంటే హీట్ మామూలుగా లేదు. పైగా వ‌ర్మ త‌న కెరీర్‌లో ఇవే బెస్ట్ షాట్స్ అని చెపుతున్నాడు.

ప్ర‌పంచంలోనే గ‌తంలో ఎప్పుడూ లేన‌ట్టుగా ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య బెస్ట్ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ షూట్ చేశాన‌ని చెపుతున్నాడు. తాజాగా వ‌దిలిన క్లిప్పింగ్ చూస్తే మ‌తులు పోతున్నాయి. ఈ వీడియోలో అప్స‌ర‌, నైనా ఇద్ద‌రూ కూడా రెచ్చిపోతున్నారు. వీళ్ల రొమాన్స్ మామూలుగా లేదు. ఒక‌రిని ఒక‌రు నాకేసుకుంటున్నారు. ఇక ఆర్జీవీ కెమేరా యాంగిల్స్ ఎలా ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. ఏదేనా వ‌ర్మ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా మాంచి విజువ‌ల్ ట్రీటే అని చెప్పాలి.

 

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news