Moviesకొర‌టాల మార్క్‌ మించి ఉందిగా.. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ' ఆచార్య...

కొర‌టాల మార్క్‌ మించి ఉందిగా.. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ‘ ఆచార్య ‘ ట్రైల‌ర్ ( వీడియో)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య‌. గ‌త మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా త‌ర్వాత చిరంజీవి చేసిన సినిమా ఇదే. అటు భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత కొర‌టాల డైరెక్ట్ చేసిన సినిమా ఇది. పైగా చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా ఈ సినిమాలో సెకండాఫ్‌లో క‌నిపించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అటు చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్ని ఎంటర్ టైన్మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు చాలా రోజుల త‌ర్వాత మెగాస్టార్ సినిమాకు స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, స్టిల్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ఈ రోజు ట్రైల‌ర్ వ‌చ్చింది. 2.33 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్ ముందుగా రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో స్టార్ట్ అయ్యింది. ట్రైల‌ర్ అంతా ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో నిండిపోయి ఉంది. ఆద్యంతం యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తోనే నింపేశారు. కొర‌టాల శివ సినిమాల్లో డైలాగుల‌తో పాటు మెసేజ్‌, అటు స‌మ‌పాళ్ల‌లో యాక్ష‌న్‌, ఇటు ఎమోష‌న్ కూడా నిండి ఉంటుంది.

 

అయితే ఆచార్య ట్రైల‌ర్ చూస్తుంటే కొర‌టాల గ‌త సినిమాల‌కు భిన్నంగా ఎక్కువుగా యాక్ష‌న్‌కు ప్ర‌యార్టీ ఇచ్చిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. చిరంజీవితో పాటు రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రి డైలాగులు అదిరిపోయాయి. అలాగే ఇద్ద‌రూ చేసిన యాక్ష‌న్ క‌ట్స్ కూడా సూప‌ర్బ్‌. చిరంజీవి, మెగా అభిమానుల‌కు మాత్ర‌మే కాకుండా.. మాస్ అభిమానుల‌కు అదిరిపోయే బిర్యాని విందుగా ఆచార్య ఉండ‌బోతోంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది.

చిరు, చెర్రీ డైలాగులు చంపేశాయి. పూజా హెగ్డే – చెర్రీ రొమాంటిక్ ట్రాక్ కూడా సూప‌ర్బ్‌గా ఉంది. ఇక సోనూసుద్ విల‌న్‌గా క‌నిపిస్తున్నాడు. విజువ‌ల్స్ క‌ళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. ఆర్ట్ వ‌ర్క్ చూస్తుంటేనే ట్రైల‌ర్ ప‌దే ప‌దే చూడాలనిపించేలా ఉంది. ఇటు బ్యాక్ గ్రౌండ్ సోర్ సూప‌ర్బ్‌. మ‌రి ఆచార్య ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ? ఈ నెల 29న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news