Moviesవ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికేసిన హీరోయిన్ శ్రీదివ్య‌... అస‌లు నిజం ఏంటి...!

వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికేసిన హీరోయిన్ శ్రీదివ్య‌… అస‌లు నిజం ఏంటి…!

కొన్ని సార్లు సెల‌బ్రిటీల విష‌యంలో మీడియా వ్య‌వ‌హ‌రించే తీరు వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను కూడా డిస్ట‌ర్బ్ చేస్తూ ఉంటుంది. అస‌లు నిజం ఏంటో తెలియ‌దు.. కానీ ఇక్క‌డ ముందుగా ఆ వార్త‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి త‌మ టీఆర్పీ రేటింగ్‌, త‌మ ఛానెల్ క్రేజ్ పెంచుకోవాల‌న్న తాప‌త్ర‌యంతో మీడియా సంస్థ‌లు అవాస్త‌వాల‌ను కూడా ఒక్కోసారి ప్ర‌చారం చేసేస్తూ ఉంటాయి. దీంతో సెల‌బ్రిటీలు చాలాసార్లు బాధితులు అవుతూ ఉంటారు. మొన్న‌టికి మొన్న ఓ రేవ్ పార్టీలో రైడింగ్ జ‌రిగితే సీనియ‌ర్ న‌టి హేమ ఉంద‌న్న వార్త‌ల‌తో ఆమె ఆవేద‌న‌కు గుర‌వ్వ‌డంతో పాటు మీడియా ముందు త‌న బాధ వెళ్ల‌గ‌క్క‌డం చూశాం.

గ‌తంలోనూ ఓ టాలీవుడ్ హీరోయిన్ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికేసింద‌న్న వార్త‌ల‌తో ఆ హీరోయిన్ కెరీర్ పెద్ద చిక్కుల్లో ప‌డింది. తెలుగులో ప‌లు సీరియ‌ల్స్‌తో పాటు కొన్ని సినిమాల ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు శ్రీ దివ్య బాగా ప‌రిచ‌య‌మే. గ‌తంలో శ్రీ దివ్య పేరు స‌డెన్‌గా వ్య‌భిచారం కేసులో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు చిక్కింది అన్న వార్త‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో స‌డెన్‌గా అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోయిన శ్రీ దివ్య తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంది.

దీంతో ఆమెకు ఆఫ‌ర్లు ఇచ్చేందుకు చాలా మంది వెనుకాడారు. అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే శ్రీ దివ్య పేరుతోనే దివ్య శ్రీ అనే మ‌రో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కూడా ఉంది. ఆమె ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ హోట‌ల్లో వ్య‌భిచారం చేస్తూ పోలీసుల రైడింగ్‌లో అడ్డంగా దొరికిపోయింది. ఆ వెంట‌నే పోలీసులు ప్రెస్‌మీట్లో కూడా సినిమా అమ్మాయి అన‌డంతో పాటు పేరు కూడా దివ్య శ్రీ పేరు ప్ర‌స్తావించ‌డంతో అంద‌రూ హీరోయిన్ శ్రీ దివ్య అనుకున్నారు.

ఈ దెబ్బ‌తో నిజాలు తెలియ‌ని చాలా మంది శ్రీ దివ్యే వ్య‌భిచారం చేస్తూ దొరికేసింద‌ని అనుకున్నారు. దీని వ‌ల్ల త‌న కెరీర్ ఇబ్బంది ప‌డ‌డంతో పాటు తాను కూడా ఎంతో మాన‌సిక క్షోభ అనుభ‌వించాన‌ని శ్రీ దివ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. సెల‌బ్రిటీల గురించి వార్త‌లు ప్ర‌సారం చేసేట‌ప్పుడు నిజానిజాలేంటో తెలుసుకుని రాయాల‌ని మీడియాకు సూచ‌న‌లు చేసింది.

ఇక శ్రీ దివ్య ముందుగా తూర్పు వెళ్లే రైలు అనే సీరియ‌ల్ ద్వారా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు ర‌విబాబు డైరెక్ట్ చేసిన మ‌నసారా సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె కెరీర్ ఒక్క‌సారిగా ట‌ర్న్ అయ్యింది. ఇప్పుడు శ్రీ దివ్య తెలుగు కంటే కూడా త‌మిళ్‌, మ‌ళ‌యాళంలో బాగా పాపుల‌ర్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news