Moviesతప్పేముంది అంటూ సమంత ను ఫాలో అవుతున్న స్టార్ డాటర్.. తగ్గేదే...

తప్పేముంది అంటూ సమంత ను ఫాలో అవుతున్న స్టార్ డాటర్.. తగ్గేదే లే..!!

స్టార్ హీరోయిన్ సమంత క్షణం కూడా తీరిక లేకుండా.. వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ గా గడిపేస్తుంది. ఒకప్పుడు సంగతి ఎలా ఉన్నా విడాకుల తరువాత మాత్రం..సమంత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటుంది. రోజుకో సరికొత్త పోస్ట్ పెడుతూ..అడిగినాడగకున్నా సలహాలు ఇస్తూ .. నెట్టింట ట్రెండింగ్ లో ఉంటుంది.సినిమా ద్వారా బాగానే సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో పలు రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ.. సుమారు ఒక్కో పోస్ట్ కి 5 లక్షలు పైగా నే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 23 మిలియన్ల ఫాలోవర్స్‌ని పోగు చేసుకుని ఉంది సమంత.. ఈ లెక్కన ఆమె ఇలాంటి బ్రాండ్స్ ప్రమోట్ చేయడం వల్ల కోట్లు సంపాదిస్తుంది.

కాగా, ఇప్పుడు సమంత రూట్ లో నే తవ్వుకొస్తుంది..స్టార్ డాటర్ శ్రీదేవి కూతురూ జాన్వీ కపూర్. సినిమాల్లో అమ్మడు పర్ ఫామెన్స్..నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏమైనా అతిలోకసుందరి కూతురు కదా..ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి. అమ్మలాగే..కాదు కాదు అమ్మకన్న కూసింత ఎక్కువే నటిస్తుంది ఈ జాన్వీ పాప. ఇక సోషల్ మీడియాలో జాన్వీ చేసే అందాల రచ్చ..ఉంది చూడు బాబోయ్..అస్సలకి చుడలేం..చూస్తే తట్టుకోలేం..తన హాట్ హాట్ ఎద అందాలనుండి ఏవో ఏవో చూయిస్తూ కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తుంటుంది. నిజం చెప్పాలంటే జాన్వీ సినిమాలో యాక్టింగ్ కన్నా కూడా. .సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలోనే తన ఇంట్రెస్ట్ చూయిస్తుంటుంది.

ఇక అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. దాదాపు జాన్వీకి 16 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. సినిమాలతో సంబంధం లేకుండా ఆన్ లైన్ మాధ్యమాలపై క్రేజ్ కొట్టేస్తోంది జాన్వీ. దశాబ్ధకాలంగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన హీరొయిన్స్ సాధించలేని అభిమానాని సంపాదించుకుంటుంది జాన్వీ. ఇక ఆ అభిమానాని క్యాష్ చేసుకుంటున్న జాన్వీ..తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ ఈమె కూడా రెండు చేతులారా సంపాదిస్తుంది. ఈ క్రమంలో సమంత తరహాలోనే జాన్వీ కూడా సోషల్ మీడియా ద్వారా మంచి సంపాదన అందుకుంటోందని టాక్. సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ చేయడానికై ఒక్కో పోస్ట్ కోసం 3 నుంచి 5 లక్షల వరకు డిమాండ్ చేస్తోందట జాన్వీ. ఇక ఇదే కంటీన్యూ అయితే జాన్వీ త్వరలోనే సమంత ను బీట్ చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news