Movies#NTR 30 సినిమా చుట్టూ ఏదో జ‌రుగుతోంది... ఒక్క‌టే టెన్ష‌న్‌...!

#NTR 30 సినిమా చుట్టూ ఏదో జ‌రుగుతోంది… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా వ‌చ్చి మూడేళ్లు దాటేసింది. 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ సినిమా రాలేదు. 2019 – 2020 – 2021 క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా కోస‌మే ఎన్టీఆర్ ఇంత టైం వేస్ట్ చేసేశాడు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రావాల్సిన ఈ సినిమా మ‌రోసారి ఈ నెల 25కు వాయిదా ప‌డింది. ఇదిలా ఉంటే త్రిబుల్ ఆర్ షూటింగ్ కంప్లీట్ కావ‌డంతో ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా ప‌ట్టాలు ఎక్కాల్సి ఉంది..

ఎన్టీఆర్ తో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాను చేసిన కొరటాల శివ మరోసారి అదిరిపోయే క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశ‌తో ఉన్నారు. అయితే ఇప్ప‌ట‌కీ కూడా షూటింగ్ ప్రారంభించ‌లేదు. దీంతో వారంతా కొర‌టాల‌పై గుర్రుతో ఉన్నారు. మూడేళ్లుగా ఎన్టీఆర్ సినిమా రాలేదు. క‌నీసం కొర‌టాల స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసి ఈ యేడాది ఏ ద‌స‌రాకో ఈ సినిమాను రిలీజ్ చేస్తే.. ఈ క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో అయినా ఎన్టీఆర్‌వి రెండు సినిమాలు వ‌చ్చిన‌ట్లు అవుతుంది.

అయితే కొర‌టాల ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయ‌కపోవ‌డంతో ఈ సినిమా షూటింగ్ ఈ యేడాది కంప్లీట్ అయ్యి.. రిలీజ్ అవుతుంద‌న్న ఆశ‌లు అయితే క‌న‌ప‌డడం లేదు. అస‌లు కొర‌టాల గ‌త స‌మ్మ‌ర్‌లో షూటింగ్ అంటూ హ‌డావిడి చేయ‌డంతో పాటు ఈ యేడాది స‌మ్మ‌ర్‌లో వ‌స్తుంద‌ని హంగామా చేశారు. తీరా చూస్తే ఇంకా షూటింగే స్టార్ట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే అస‌లు ఇంకా స్క్రిఫ్టే పూర్తి కాలేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

పైగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యాక ఎలా లేద‌న్నా నెల రోజుల పాటు ఎన్టీఆర్ ప్ర‌మోష‌న్ల‌లో బిజీ కావాలి. ఆ త‌ర్వాత చిరు ఆచార్య కోసం కొర‌టాల ప్ర‌మోష‌న్లు చేయాలి. అంటే ఏప్రిల్ ఆ త‌ర్వాతే కాని ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా ప‌ట్టాలు ఎక్కేలా లేదు. తెలుస్తోన్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో జాన్వీక‌పూర్‌ను ఇప్ప‌టికే హీరోయిన్‌గా సెల‌క్ట్ చేశార‌ని అంటున్నారు.

త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు ఇదే క‌రెక్టు టైం.. ఇలాంటి టైంలో పెద్ద గ్యాప్ లేకుండా.. రెండు, మూడు సినిమాలు వ‌స్తే అది ఎన్టీఆర్ ఇమేజ్‌ను మ‌రింత స్కై రేంజ్‌కు తీసుకు వెళుతుంది. కానీ కొర‌టాల లేట్ వ‌ల్ల ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్‌పై ఇంట్ర‌స్ట్ పోయేలా ఉంది. మ‌రి ఇప్ప‌ట‌కి అయినా కొర‌టాల సినిమా షూటింగ్ త్వ‌ర‌గా స్టార్ట్ చేస్తాడేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news