Moviesఫస్ట్ టైం విజయ్‌తో పెళ్లి పై నోరు విప్పిన రష్మిక..క్లారిటీ ఇచ్చేసిందిరోయ్..!!

ఫస్ట్ టైం విజయ్‌తో పెళ్లి పై నోరు విప్పిన రష్మిక..క్లారిటీ ఇచ్చేసిందిరోయ్..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం. అప్పుడు ఏమైనా జరగచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. తాజా పరిస్ధితులు చూస్తుంటే.. విజయ్ రష్మిక ల లైఫ్ లో అదే జరిగిన్నట్లు తెలుస్తుంది. నేష‌న‌ల్ మీడియాలో సైతం ఆ వార్త‌ల‌ను ప్ర‌చురించారు. వీరు ఇరు కుటుంబాల‌ను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాదిలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఇటీవ‌ల క‌థ‌నాలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు లేక నేను లేను అన్నట్లు సాగిన వీళ్ళ మధ్య యవ్వారం..ఇప్పుడు యూటర్న్ తీసుకుని.. మీకు మీరే మాకు మేమే అన్నట్లు తయారైంది సిట్యువేషన్.

గత కొంత కాలంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ..రష్మిక ల మధ్య ఏదో కిచ్ కిచ్ మ్యాటర్ నడుస్తుందని..విజయ్ ఎక్కడ ఉంటే అక్కడను రష్మిక వాళ్లిపోతుందని.. న్యూ ఇయర్ సెల్స్బ్రేషన్స్ ని కూడా ఫ్యామిలీతో కాకుండా విజయ్ తో గొవాలో సీక్రేట్ గా సెలబ్రేట్ చేసుకుందని..వార్తలు వచ్చాయి. దీంతో వీళ్లు ఇద్దరు డీప్ లవ్ లో ఉన్నారు అనుకున్నారు అంతా..దానికి తగ్గట్లే..నైట్ డిన్నర్ పార్టీలకు ఇద్దరే వెళ్లి మీడియా కంట పడ్డారు. ఇంకెముంది..త్వరలో నే ఈ జంట గుడ్ న్యూస్ చెప్తారు అనుకున్నారంతా.

కానీ సీన్ కట్ చేస్తే..వీళ్ల మధ్య మ్యాటర్ చెడిన్నట్లుంది. ఇప్పుడు ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదట. అందుకే వీళ్ళ మధ్య ఏదో తెలియని గ్యాప్ వచ్చిందని అంటున్నారు నెటిజన్స్. కాగా ఈ మధ్యనే విజయ్..రష్మిక తో పెళ్లి పై స్పందిస్తూ..మా మధ్య అలాంటిది ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు రీసెంట్ గా రష్మిక నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ రష్మిక బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఇదే ప్రశ్న ఎదురవ్వగా..”ఇలాంటి వార్తలు నాకు కొత్తకాదు. ఆ వార్తలు చూసి నవ్వుకోవటం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత సమయం నా దగ్గర లేదు అని రష్మిక చెప్పేసిందట”..ప్రస్తుతం రష్మిక మాటాలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news