Moviesస‌న్నీలియోన్ చేయి ప‌ట్టుకుని మోహ‌న్‌బాబు మామూలు ర‌చ్చ కాదుగా (వీడియో)

స‌న్నీలియోన్ చేయి ప‌ట్టుకుని మోహ‌న్‌బాబు మామూలు ర‌చ్చ కాదుగా (వీడియో)

స‌న్నీలియోన్ సినిమాల్లో న‌టిస్తుంది అంటే మామూలు ర‌చ్చ కాదు. పోర్న్ వీడియోల్లో న‌టించిన స‌న్నీకి ప్ర‌పంచ వ్యాప్తంగానే యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. అస‌లు ఎన్నో సంద‌ర్భాల్లో గూగుల్లో సెర్చ్ చేసిన వ్య‌క్తుల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో పాటు దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న మ‌హామ‌హుల‌ను, సెల‌బ్రిటీల‌ను కూడా తోసిరాజ‌ని స‌న్నీలియోన్ ఫ‌స్ట్ ప్లేసులో నిలిచిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. రెండు, మూడేళ్లు అయితే గూగుల్ సెర్చింగ్ ప‌రంగా మోడీ లాంటి వాళ్ల‌కే షాక్ ఇచ్చి స‌న్నీ ఫ‌స్ట్ ప్లేసులో ఉంది.

స‌న్నీలియోన్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. మంచు మ‌నోజ్ న‌టించిన క‌రెంటుతీగ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసి యూత్‌ను పిచ్చ‌గా క‌వ్వించేసింది. ఆ త‌ర్వాత చాలా రోజుల‌కు స‌న్నీ మ‌ళ్లీ మంచు ఫ్యామిలీ హీరో న‌టిస్తోన్న సినిమాలోనే న‌టించ‌బోతోంది. మా అధ్య‌క్షుడు మంచు విష్ణు గ‌త యేడాది కాలంగా సినిమాల్లో న‌టించ‌లేదు.

మోస‌గాళ్లు త‌ర్వాత విష్ణు తాజాగా ఈ షాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో గాలి నాగేశ్వ‌ర‌రావుగా క‌నిపించ బోతున్నాడు. ఈ సినిమాలో విష్ణుకు జోడీగా ఇద్ద‌రు హాట్ బ్యూటీలు న‌టిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేం పాయ‌ల్ రాజ్‌పుత్‌తో పాటు స‌న్నీలియోయ‌న్ కూడా న‌టిస్తోంది. గాలి నాగేశ్వ‌ర‌రావు అన్న టైటిల్‌తోనే విష్ణు సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. మ‌రి ఈ సినిమా కామెడీ , యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు స‌న్నీలియోన్ హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. షూటింగ్ పూర్త‌య్యాక మోహ‌న్‌బాబు ఆమెను ప్ర‌త్యేకంగా తిరుప‌తిలో త‌మ విశ్వ‌విద్యాల‌యానికి తీసుకువెళ్లారు. అక్క‌డ స‌న్నీలియోన్‌ను చూసిన వెంట‌నే మోహ‌న్‌బాబు వ‌ర్సిటీ విద్యార్థులు కేరింత‌లు, ఈల‌ల‌తో నానా అల్ల‌రి చేశారు. మోహ‌న్‌బాబు స్వ‌యంగా స‌న్నీలియోన్ చేయి ప‌ట్టుకుని విద్యార్థుల‌కు హాయ్ చెప్పించారు. దీంతో అక్క‌డ నానా ర‌చ్చ జ‌రిగి విద్యార్థులు ఆనందం ప‌ట్ట‌లేక‌.. ఆ శృంగార తార త‌మ ఎదురుగా ఉండ‌డంతో విజిల్స్ వేశారు.

అయితే ఆమెను చుట్టుముట్టేందుకు విద్యార్థులు ప్ర‌య‌త్నించినా కూడా బౌన్స‌ర్లు ఆమెకు చుట్టూ ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉండి అడ్డుకున్నారు. ఈ వీడియోను స‌న్నీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో పాటు మోహ‌న్‌బాబుకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news