Moviesసమంత మరో సెన్సేషనల్ రికార్డ్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!!

సమంత మరో సెన్సేషనల్ రికార్డ్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!!

స్టార్ హీరోయిన్ సమంత .. విడాకుల తరువాత జెట్ స్పీడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ మిగతా హీరోయిన్స్ కి దడ పుట్టిస్తుంది. పెళ్ళికి ముందు కూడా చేయనటువంటి హాట్ ఎక్స్ పోజింగ్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. హాట్ ఫోటోస్ పై ఏమన్నా కామెంట్ చేస్తే..మళ్ళి మనకే గట్టి కౌంటర్లు ఇస్తుంది సామ్. కాగా సమంత పలు బడా ప్రాజెక్ట్స్ తో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీ గా ఉంది.

రీసెంట్ గా సమంత ఐటెం సాంగ్ గా నటించిన పుష్ప సినిమాలోని “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ” సాంగ్ సరికొత్త రికార్డ్ నెలకోల్పింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా పాట సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ నంబర్స్ కాగా.. స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డిసెంబర్ 10వ తేదిన విడుదలైన ఈ లిరికల్ సాంగ్ కేవలం 20 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.

కాగా… ప్రముఖులు సైతం స్టెప్పులు వేసిన ఈ పాట.. వ్యూస్ పరంగా మరో మైలురాయిని అందుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట 200 మిలియన్ వ్యూస్‌ని అధిగమించింది. ఇప్పటివరకు ఓ తెలుగు ఐటెం సాంగ్‌కి ఈ స్థాయిలో వ్యుస్ దక్కించుకోవడం ఇదే తోలిసారి . అది కూడా సమంత ఫస్టైం చేసిన ఐటెం సాంగ్ కావడం మరో విశేషం. ఇక అభిమానులు ఇదంతా సమంతా వల్లనే జరిగింది..ఆమె మేనియానే ఇన్ని రికార్డులు సృష్టించడానికి కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. ఈపాట లో సమంత్ డ్యాన్స్ , ఎక్స్ ప్రేషన్స్ ..మామూలుగా ఉండవు. చించేసింది అంటూ పోగుడుతుంటే..మరికొందరు బట్టలు విప్పుతూ ఎక్స్ పోజింగ్ చేసే ఈ పాట ఇన్ని రికార్డులు సాధించడం మన తెలుగు ఇండస్ట్రీ పరువు పోయే పని అంటూ సమంత ను పరోక్షంగా తిడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news