Moviesరానా త‌మ్ముడు ' ద‌గ్గుబాటి అభి ' ఫ‌స్ట్ సినిమా టైటిల్‌తోనే...

రానా త‌మ్ముడు ‘ ద‌గ్గుబాటి అభి ‘ ఫ‌స్ట్ సినిమా టైటిల్‌తోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చారే..!

మన టాలీవుడ్ సినిమా రంగంలో ఎంతో మంది వార‌సులు వ‌చ్చారు.. వారిలో కొంద‌రు స‌క్సెస్ అయ్యారు. మ‌రి కొంద‌రు స‌క్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ కోవ‌లోనే టాలీవుడ్‌లో ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడో త‌రం వార‌సుడిగా ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌బాబు రెండో త‌న‌యుడు ద‌గ్గుబాటి అభి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రామానాయుడు వార‌సుల్లో సురేష్‌బాబు నిర్మాత‌గా, వెంక‌టేష్ హీరోగా ఉన్నారు.

ఇప్పుడు సురేష్‌బాబు పెద్ద కుమారుడు రానా హీరోగా రాణిస్తున్నాడు. రానా స్టార్ హీరో కాక‌పోయినా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు రానా సోద‌రుడు ద‌గ్గుబాటి అభి కూడా హీరో అవుతున్నాడు. కొద్ది రోజులుగా అభి వెండితెరంగ్రేటం గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజాగా ఎంతోమంది యంగ్ టాలెంట్‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో అభి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

అభి తొలి సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు తేజ‌తో పాటు సురేష్‌బాబు కూడా ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌, టైటిల్‌ను మేక‌ర్స్ ఈ రోజు తేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రివీల్ చేశారు. అహింస అన్న టైటిల్ పెట్టారు. టైటిలే విచిత్రంగా ఉంద‌నుకుంటే… లుక్‌లో అభిని కూడా డిఫ‌రెంట్‌గా చూపించారు. మొహానికి సగం వరకు ఒక గుడ్డ తో కప్పివేసి అందులోని బాగా దెబ్బలు తగిలి ఉన్నాడు. ర‌క్తం కారుతూ ఉంది.

తేజ సినిమాలు, టైటిల్స్ అంటేనే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే ఫార్మాట్‌లో ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్ ? ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాకు ఆర్పీ. ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆనందీ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news