Moviesఆ స్టార్ హీరోతో ఐటెం సాంగ్..షాకింగ్ కండీషన్ పెట్టిన జిగేలు రాణి..?

ఆ స్టార్ హీరోతో ఐటెం సాంగ్..షాకింగ్ కండీషన్ పెట్టిన జిగేలు రాణి..?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతుంది. వరుణ్ తెజ్ తో కలిసి ముకుంద అనే సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తరువాత నాగచైతన్య తో ఒక లైలాకోసం అనే సినిమాలో కూడా నటించి అందరిని మెప్పించింది. కానీ ఇండస్ట్రీలో ఎదగాలంటే భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడాల్సిందే. ఇక అలాంటి ఒక్క హిట్ కోసం..పూజా చాలా సంవత్సరాలు కష్టపడింది.

ఇక ఎట్టకేలకు ఫైనల్ గా యంగ్ టైగర్ తారక్ తో కలిసి అరవింద విరరాఘవ సమేత అనే సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇంకా ఆ తరువాత అమ్మడుకి ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ పడలేదు. వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ ..చేసిన సినిమా హిట్ కొడుతూ..టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం అమ్మడు చేస్తున్న అన్నీ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కినాటివే. బడా బడా హీరోలందరికి ఇప్పుడు పూజానే కావాలంటూ ఆమె కోసం ఎగబడుతున్నారు. ఏం చేస్తాం పూజా అందం అలాంటిది మరి.

ఇక ఆ మధ్య ఓ సారి రంగస్దలం సినిమాలో చరణ్ పక్కన జిల్ జిల్ జిల్ జిగేళు రాణి అంటూ ఆడిపాడిన ఈ భామ ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడిందట. పూజాతో ‘యానిమల్’ అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయించడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెగ ట్రై చేస్తున్నారనే వార్త సినీ వర్గాలల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ – పరిణీతి చోప్రా నటిస్తున్నారు. అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం.

ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్న అమ్మడు..ఓ కండీషన్ పెట్టిందట. ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తేనే పాటకు సైన్ చేస్తా అంటుందట. కొంచెం భారీగానే పారితోషాని అడిగిన డైరెక్టర్ మాత్రం ఆ విషయంలో అసలు తగ్గట్లేదట. అమ్మడు అడిగిన అమౌంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారని..త్వరలోనే దీని పై అఫిషీయల్ ప్రకటన రానుందని టాక్ వినబడుతుంది. మరి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా పూజా ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news