Moviesబిగ్‌బాస్‌ ఓటీటీలోకి వెళ్లనున్న ఆ స్టార్ కొత్త జంట..ఇక 24*7 అదే...

బిగ్‌బాస్‌ ఓటీటీలోకి వెళ్లనున్న ఆ స్టార్ కొత్త జంట..ఇక 24*7 అదే పని..?

బుల్లితెరపై అలరించే బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్నంత క్రేజ్‌ మరే షోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ షో స్టార్ట్ అవుతుంది అంటే చాలు..సోషల్ మీడియాలో ఈ షో కి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. వచ్చేది 100 రోజులే అయినా అది వచ్చినన్ని రోజులు దానిపై బోలెడన్ని వార్తలు. బిగ్ బాస్ కు అదే కావాలి. అప్పుడే బోలెడంత పబ్లిసిటీ వస్తుంది. అయితే జనరల్ గా అందరు అంటుంటారు బిగ్ బాస్ లో జరిగేది ఒకటి..కానీ మనకు చూపించేది మరోకటి అని. అంతేగా 24 గంటలు లైవ్ ను రికార్డ్ చేసి..కేవలం దానిలో ఒక గంట సేపు మాత్రమే సీన్స్ కట్ చేసి వాళ్ళకు కావాల్సిన కంటెంట్ ను మనకు చూయిస్తున్నారు.

ఇక ఇదే విషయమై బిగ్ బాస్ బాగా ఆలోచించి 24 గంటలు లైవ్ పెడితే బాగుంటుందని భావించి .. బిగ్‌బాస్ ఓటీటీ (ఓవర్ ది టాప్)‌లో రియాలిటీ షోను నిర్వాహకులు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి ఓటీటీలో బిగ్‌బాస్ షోను ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. . ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ప్రసారం కానున్న ఈ షోకు సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ మధ్యనే దీనికి సంబంధించిన ప్రొమో వదులుతూ..ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీలోకి వెళ్ళే లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పలువురు స్టార్స్ పేర్లు వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ లిస్ట్ లో ముందు బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఒకలా కనిపించిన లిస్ట్..సడెన్ గా ప్రోమో రిలీజ్ అయ్యాక కొత్త పేర్లు తెర పై కొచ్చాయి. వీరిలో ప్రముఖంగా టాలీవుడ్ లో సీరియల్ జంట పేరు హైలెట్ గా నిలిచింది. ఈ మధ్యనే ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంటకు భారీ డీల్ మాట్లాడి మరీ లోపలికి పంపిస్తున్నారట. అసలే కొత్త జంట..ఆ పై లోపలికి ఇద్దరు కలివెళ్తున్నారు..ఇక 24 గంటలు లైవ్ వస్తుంది..బిగ్ బాస్ ఏ ఉద్దేశ్యంతో ఈ జంటను సెలక్ట్ చేసి ఉంటారో అందరికి బాగా అర్ధమైపోయింది. కానీ ఆ జంట అలా నడుచుకుంటారా లేదా అనేది మనం లైవ్ లో చూడాల్సిందే..అది తెలియాలంటే 26 వ తేదీ వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news