Moviesఆ హీరోయిన్ల‌ను స‌మంత తొక్కేస్తోందా... ఇది దిగ‌జార‌డ‌మే క‌దా...!

ఆ హీరోయిన్ల‌ను స‌మంత తొక్కేస్తోందా… ఇది దిగ‌జార‌డ‌మే క‌దా…!

స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ హ‌డావిడి చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక ఆమెకు అడ్డూ అదుపూ లేద‌నుకుంటా..! చాలా స్వేచ్ఛ‌గా ఉంటోంది. ఓ వైపు శాకుంత‌లం ఫినిష్ చేసి ఆ త‌ర్వాత యశోద సినిమా చేస్తోంది. అటు కోలీవుడ్‌లో కార్తీతో ఓ సినిమా.. ఇటు బాలీవుడ్ మాత్ర‌మే కాదు.. ఓ హాలీవుడ్ సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతోంది. అటు వెండితెర మాత్ర‌మే కాదు బుల్లితెర‌, ఓటీటీ, టాక్ షో, ఐటెం సాంగ్, వెబ్ సీరిస్ ఇలా ఎక్క‌డ చూసినా స‌మంత హంగామాయే ఉంటోంది.

స‌మంత‌కు ఎంత వ‌య‌స్సు మీద ప‌డినా.. ఓ సారి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినా ఓ రేంజ్‌, ఓ క్రేజ్ అయితే ఉన్నాయి. విడాకుల త‌ర్వాత ఆమెకు వ‌స్తోన్న ఆఫ‌ర్లు, ఆమె చేసిన ఐటెం సాంగే ఇందుకు నిద‌ర్శ‌నం. అయితే స‌మంత లాంటి స్టార్ హీరోయిన్ మ‌రీ చిన్న చిన్న షాపుల ఓపెనింగ్స్‌కు కూడా వెళుతుంద‌ని ఆమె అభిమానులు అస్స‌లు ఊహించిఉండ‌రు. కానీ ఇప్పుడు ఆమె ఆ ప‌నులు కూడా చేసేస్తోంది.

ఒక్కో సినిమాకు రు. 2-3 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకునే స‌మంత‌.. కాదు ఇంకా చెప్పాలంటే ఒక్కో ఐటెం సాంగ్‌కే రు. 1.5 కోట్లు తీసుకుంటోన్న ఆమె రు. 15 ల‌క్ష‌ల కోసం షాప్ ఓపెనింగ్‌ల‌కు వెళ్ల‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే..! సమంత తాజాగా న‌ల్ల‌గొండ‌లో ఓ షాప్ ఓపెనింగ్‌కు హాజ‌రైంది. ఆమెకు మ‌హా అయితే రు. 15- 20 ల‌క్ష‌ల‌కు మించి రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌రు. ఆమె అక్క‌డ గంట పాటు సంద‌డి చేసింది. ఆమెను చూసేందుకు భారీ ఎత్తున జ‌నాలు కూడా త‌ర‌లివ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆమె అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడారు కూడా..!

న‌ల్ల‌గొండ లాంటి చిన్న ప‌ట్ట‌ణంలో స‌మంత షాప్ ఓపెనింగ్‌కు వెళితే మ‌హా అయితే రు. 15 ల‌క్ష‌లు ఇస్తారు. ఇవ‌న్నీ కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న హీరోయిన్లో లేదా ఛాన్సులు లేక ఉన్న మీడియం రేంజ్ హీరోయిన్లో చేస్తూ ఉంటారు. అయితే స‌మంత ఈ షాప్ ఓపెనింగ్‌లు చేయ‌డం ఏంటా ? ఇది మ‌రీ ఆమె స్థాయిని త‌గ్గించేసుకున్న‌ట్టే అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె చేస్తోన్న ఈ ప‌నుల‌తో చిన్న హీరోయిన్ల‌కు కూడా ఈ ఓపెనింగ్ ఛాన్సులు ఉండ‌వ‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం స‌మంత ఆ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌డం వ‌ల్లే ఆమె వెళ్లింద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news