Moviesద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ప్రేమ‌పెళ్లిలో ఇన్ని ట్విస్టులా...!

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ప్రేమ‌పెళ్లిలో ఇన్ని ట్విస్టులా…!

టాలీవుడ్ లో రైటర్గా డైరెక్టర్‌గా పరశురామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా డైరెక్టర్ గా మారిన పరశురాం తొలి సినిమాతోనే ఒక్కసారిగా ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు – గీతగోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. గీతా గోవిందం తర్వాత ప‌ర‌శురాంకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ప‌ర‌శురాం – మహేష్ బాబు కాంబినేషన్ లో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి సాంగ్ టోట‌ల్ సోష‌ల్‌ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఒక్క సాంగ్ అలా రిలీజ్ అయిందో లేదో.. వెంటనే సినిమాకు బ్లాక్‌బ‌స్టర్ టాక్ వచ్చేసింది.

సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప‌ర‌శురాం టాలీవుడ్ లో టాప్ రేంజ్ దర్శకుల జాబితాలో చేరిపోతారు అనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక పరశురామ్ దంప‌తుల‌ది ప్రేమ వివాహం. పరశురాం భార్య పేరు అర్చన. ఓ సందర్భంలో పరశురాం – అర్చన ఇద్దరూ తమ ప్రేమ పెళ్లి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ప‌ర‌శురాం మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి అమ్మ అంటే ఎంతో ఇష్టం అని.. ఓసారి అత్త‌ చెల్లిని కాలేజీలో డ్రాప్ చేసేందుకు వెళ్ళినప్పుడు అర్చనను చూశా అని చెప్పాడు.

అర్చన లో అమ్మ పోలికలు ఉన్నాయని.. ఆ వెంటనే తాను ఆమెపై మనసు పారేసుకున్నా అని.. తాను ముందు లవ్ ప్రపోజ్ చేసినా కూడా అర్చన నో చెప్పిందని పరుశురాం చెప్పారు. ఇక అర్చన మాట్లాడుతూ మాది జాయింట్ ఫ్యామిలీ అని.. నాన్న పోలీస్ ఆఫీసర్ అని… ప‌ర‌శురాం లవ్ ప్రపోజ్ చేసినప్పుడు నో చెప్పిన తర్వాత.. అతడి మనస్తత్వం అర్ధం అయ్యాక ఓకే చెప్పానని అర్చన తెలిపారు. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిన వెంటనే అమ్మమ్మ వాత పెట్టిందని అర్చ‌న చెప్పారు.

అర్చ‌న ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోదాం అంటే.. పరశురాం మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పాడని అర్చన చెప్పుకొచ్చారు. పెళ్లయ్యాక షూటింగులతో బిజీగా ఉండడంతో ఒక్కసారి నాపై ప్రేమ తగ్గిపోయిందా అనిపించేది అని అర్చన వెల్లడించారు. పరశురాం మాత్రం అర్చన ఎప్పుడు అమ్మను మరిపిస్తుంది అని… సారొచ్చారు సినిమా తర్వాత మూడేళ్ల ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news