Moviesషాకింగ్ స్క్రీన్ షాట్లను బయట పెట్టిన హీరోయిన్.. తెర పై కొత్త...

షాకింగ్ స్క్రీన్ షాట్లను బయట పెట్టిన హీరోయిన్.. తెర పై కొత్త బాంబ్..!!

పూనమ్ కౌర్..సినిమాలకు దూరంగా కాంట్రవర్షీయల్ కామెంట్స్ కి దగ్గరగా ఉంటుంది అని అంటారు కొందరు నెటిజన్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో అంతగా అవకాశాలు లేని ఈ భామ తనకు అవసరం లేని విషయాల్లో కూడా కలిపించికుని మాట్లాడటం ఆమెకే నెగిటీవ్ గా మారుతుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ మరియు ట్వీట్స్ తో సోషల్ మీడియా లో నానుతూనే ఉంది.

గతంలో కత్తి మహేష్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కి రచ్చ రచ్చ అవుతున్న సమయంలో పూనమ్ కౌర్ హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పూనం కౌర్ లకు సంబంధించి ఆడియో టేప్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ గురించి కత్తి మహేష్ తన ప్రెస్ మీట్ లో మాట్లాడటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

గత కొంత కాలంగా పూనమ్ తెలుగు ఇండస్ట్రీ లోని ఒక టాప్ డైరెక్టర్ ని ఉద్దేశించి పలుమార్లు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిందని అందరికి తెలిసిందే. ఆ బడా డైరెక్టర్ గతంలో పూనమ్ కి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి, చివరి నిమిషం లో మరొక హీరోయిన్ కి ఆ అవకాశం ఇచ్చారని అప్పటి నుండి పూనమ్ సదరు డైరెక్టర్ పై కక్ష కట్టిందని ఇండస్ట్రీ లో టాక్.

కాగా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్” సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈసినిమాకి సంబంధించి పూనమ్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా పూనమ్ కౌర్ ఓ వాట్సప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. “బావ సినిమాకి వచ్చాను అక్కా” అని ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. అందులో హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది. దానికి జవాబుగా సినిమా సూపర్ హిట్ అన్నాడు. ఈ చాట్‌ను అంతా ఓ లవ్ ఎమోజీ పెట్టి షేర్ చేసింది పూనమ్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news