Moviesమ‌హేష్ హీరోయిన్ అమృత‌ను భ‌ర్త అంత టార్చ‌ర్ పెట్టాడా.. అదే కార‌ణ‌మా...!

మ‌హేష్ హీరోయిన్ అమృత‌ను భ‌ర్త అంత టార్చ‌ర్ పెట్టాడా.. అదే కార‌ణ‌మా…!

అమృతా రావు ఈ పేరు చెపితే తెలుగు ప్రేక్ష‌కులు, తెలుగు సినిమా వాళ్లు పెద్ద‌గా గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు.. కానీ మ‌హేష్‌బాబు అతిథి సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠ‌క్కున గుర్తొస్తుంది. 2007లో మ‌హేష్‌బాబు – సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేదు. అయితే అప్ప‌ట్లో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వ‌చ్చిన అమృత మ‌హేష్ ప‌క్క‌న క్యూట్ హీరోయిన్‌గా బాగా సెట్ అయ్యింది. సినిమా హిట్ అవ్వ‌క‌పోయినా ఆమె న‌ట‌న‌, అంద‌చందాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె ఇక్క‌డ అడ్ర‌స్ లేదు.

బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేసిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత రేడియో జాకీ అన్మోల్ సూద్‌ని ప్రేమించి 2016లో అత‌డితో మూడు ముళ్లు వేయించేసుకుంది. ఆ త‌ర్వాత ఆమెకు ఆఫ‌ర్లు లేవు. దీంతో ఆమె భ‌ర్త‌తో క‌లిసి కపుల్ ఆఫ్ థింగ్స్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ స్టార్ట్ చేసింది. త‌న ఛానెల్లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేసే అమృతారావు తాజాగా ఫ‌స్ట్ ఫైట్ పేరుతో ఓ వీడియో పోస్ట్ చేయ‌డంతో త‌న భ‌ర్త‌కు, త‌న‌కు జ‌రిగిన ఓ పెద్ద గొడ‌వ గురించి కూడా చెప్పింది.

అన్మోల్ – తాను పెళ్లి చేసుకోవాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు ఒక రోజు అన్మోల్ వ‌చ్చి అమృత‌తో నువ్వు సినిమాలు మానేయాల‌ని చాలా సీరియ‌స్‌గా చెప్పాడ‌ట‌. అయితే అన్మోల్ తీసుకున్న ఈ నిర్ణ‌యం త‌న‌ను ఎంతో బాధ పెట్టింద‌ని.. తాను ఎంత‌గానో ప్రేమించే సినిమా కెరీర్‌ను తాను వ‌దిలేయాలా ? అని తాను ఎంతో టార్చ‌ర్ అనుభ‌వించాన‌ని.. రెండు రోజుల పాటు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నా అని చెప్పింది.

అయితే తాను ఏడుస్తున్న విష‌యం తెలుసుకున్న అన్మోల్ త‌ట్టుకోలేక వెంట‌నే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్పాడ‌ట‌. అన్మోల్ త‌న కెరీర్ కంటిన్యూ చేసుకోవ‌చ్చ‌ని చెప్ప‌డంతో త‌న మ‌న‌స్సు కుదుట ప‌డింది అంటూ ఆ వీడియోలో చెప్పుకువ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news