Moviesఫ‌స్ట్ సాంగ్‌కే స‌ర్కారు వారి పాట‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ‌... పండ‌గ చేస్కోండ్రా...

ఫ‌స్ట్ సాంగ్‌కే స‌ర్కారు వారి పాట‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ‌… పండ‌గ చేస్కోండ్రా ప్రిన్స్ ఫ్యాన్స్ (వీడియో)

స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండేళ్ల నుంచి మ‌హేష్ సినిమా థియేట‌ర్ల‌లోకి రాలేదు. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఈ సినిమా స్టిల్స్ చూస్తుంటూనే ముందు నుంచి బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌రే అన్న టాక్ తెచ్చుకుంది. పైగా మ‌హేష్‌బాబు క్యూట్ లుక్స్ – కీర్తి సురేష్ అంద‌చందాలు.. అస‌లు ఆ జంట‌ను తెర‌మీద చూస్తాం అన్న ఊహే అదిరిపోతోంది.

ఇక తాజాగా రిలీజ్ అయిన క‌ళావ‌తి సాంగ్ ప్రోమోయే సినీ ల‌వ‌ర్స్‌కే కాదు. నిజ‌జీవితంలో ప్రేమికుల‌కు, రొమాంటిక్ క‌ఫుల్స్‌గా ఉన్నోళ్ల‌కు పిచ్చెక్కించేసేంది. క‌ళావ‌తి సాంగ్ ముందుగా లీక్ అవ్వ‌డంతో ఈ సినిమా యూనిట్ ఈ రోజు సాయంత్రం ఈ క‌ళావ‌తి ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసేసింది. ఫ‌స్ట్ టైం వింటేనే పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసేలా ఉంది.

 

అనంత శ్రీరామ్ సాహిత్యం చాలా సింపుల్‌గా.. అచ్చ తెలుగులో అదిరిపోయింది. సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను పాడిన విధానానికి మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఫిదా అవ్వాల్సిందే. ఇక థ‌మ‌న్ ఇచ్చిన క్లీన్ మ్యూజిక్ కూడా ఎన్ని సార్లు విన్నా ఈ సాంగ్ విన‌సొంపుగానే ఉండేలా చేసింది. ఏదేమైనా అల వైకుంఠ‌పురంలో రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చార్ట‌ర్‌ను మ‌న‌కు థ‌మ‌న్ మ‌రోసారి చూపించబోతున్నాడు.

ఇక మ‌హేష్‌ను చూస్తుంటే మ‌నం 20 ఏళ్ల క్రింద‌ట మ‌హేష్‌ను మ‌ళ్లీ చూస్తున్నాం.. మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ కూడా చాలా అందంగా మ‌హేష్ ప‌క్క‌న చ‌క్క‌టి జోడీగా సెట్ అయ్యింది. ఏదేమైనా ఫ‌స్ట్ సాంగ్‌తోనే క్లాసి బ్లాక్‌బ‌స్టర్ టాక్ బొమ్మ‌కు వ‌చ్చేసింది. మ‌హేష్ ఫ్యాన్స్‌ను మ‌నం ఇక ఆపేదేలే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news