Moviesదీపికా ప‌దుకొనేను వాటి సైజ్ పెంచుకోమ‌న్న‌ది ఎవ‌రు.. ప‌ట్ట‌రాని కోపం..!

దీపికా ప‌దుకొనేను వాటి సైజ్ పెంచుకోమ‌న్న‌ది ఎవ‌రు.. ప‌ట్ట‌రాని కోపం..!

సినిమా ఇండ‌స్ట్రీలో టాప్ పొజిష‌న్లో ఉన్న హీరోయిన్ల‌కు ట్రోలింగ్ అనేది ఇటీవ‌ల కాలంలో కామ‌న్ అయిపోయింది. అయితే హీరోయిన్లు కూడా మ‌రీ వీటినే ప‌ట్టించుకుని ఫీల్ అయితే క‌ష్టం… అస‌లు వాటిమీద స్పందించ‌క‌పోవ‌డ‌మే బెస్ట్‌.. వాటికి ఆన్స‌ర్లు చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వార్త‌లు రాసేస్తూ ఉంటారు. ఎంత లైట్ తీస్కోవాల‌ని అనుకున్నా మ‌నస్సుకు గుచ్చుకుంటూ ఒక్కోసారి బాధ‌పెడుతూ ఉంటాయి.

ఎంతో గొప్ప అంద‌గ‌త్తెగా పేరు తెచ్చుకున్న దీపికా ప‌దుకొనేకు కూడా ఆమె బాడీ షేమింగ్ కామెంట్స్ త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే త‌నకు ఎదురైన ఓ చెత్త ప్ర‌శ్న ను ఆమె బ‌య‌ట పెట్టింది. ఓ వ్య‌క్తి త‌న వ‌క్షోజాల సైజు పెంచుకోమ‌ని ఆమెకు స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. ఆ టైంలో త‌న‌కు చాలా కోపం వ‌చ్చింద‌ని.. అయినా ఎంతో స‌హ‌నంతో ఓర్చుకున్నాన‌ని ఆమె వాపోయింది. ప్రియాంక తాజాగా న‌టించిన గెహ‌రాయిన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న్లో భాగంగా ఓ జ‌ర్న‌లిస్ట్ మీకు జీవితంలో ఎవ‌రైనా ఇచ్చిన చెత్త స‌ల‌హా ఏద‌ని ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు పైన చెప్పిన విష‌య‌మే ఆన్స‌ర్ చేసింది దీపికా. త‌న ఎద సైజును పెంచుకోమ‌ని ఓ వ్య‌క్తి చెత్త స‌ల‌హా ఇచ్చాడ‌ని చెప్పినా.. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది మాత్రం దీపిక బ‌య‌ట పెట్ట‌లేదు. ఇక షారుక్ త‌న‌కు జీవితంలో ది బెస్ట్ స‌ల‌హా ఇచ్చాడ‌ని ప్ర‌శంసించింది.

బాగా తెలిసిన వాళ్ల‌తోనే సినిమాలు చేయ‌మ‌ని షారుక్ సూచించాడ‌ట‌. సినిమాలు చేయ‌డం అంటే కేవ‌లం న‌టించ‌డం మాత్ర‌మే కాద‌ని.. జీవితంలో ఓ భాగం అంటూ త‌న జ్ఞాప‌కాలు.. అవి పొందే క్ర‌మంలో తెలిసిన వాళ్ల‌తోనే ట్రావెల్ చేస్తే బాగుంటుంద‌ని షారుక్ చెప్పాడ‌ని ఆమె చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news