Moviesవామ్మో..ఇదేం ట్వీస్ట్ రా బాబు..చై-సామ్ ఎప్పటికి ఒక్కటే..సమంత సంచలన కామెంట్స్..!!

వామ్మో..ఇదేం ట్వీస్ట్ రా బాబు..చై-సామ్ ఎప్పటికి ఒక్కటే..సమంత సంచలన కామెంట్స్..!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్.. అదే నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ సెలబ్రిటీ జోడీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారనే సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వరకు కూడా టాలీవుడ్‌లో మోస్ట్‌ లవ్లీ, రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విదీపోతున్నారు అనేసరికి అక్కినేని అభిమానులు చాలా బధపడుతున్నారు. ప్లీజ్ విడిపోకండి అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న మీరు చిన్న చిన్న కారణాలకు విడిపోవడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అయితే చైతన్యతో సమంత విడిపోతుంది అని తెలిసిన్నప్పుడు చాలా మంది ఆమెను టార్గెట్ చేస్తూ తిట్టిపోశారు. నీకు చై లాంటి వాడి దొరకడు..ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది..అంటూ కొందరు కామెంట్స్ చేసారు . ఇంకొందరు అయితే ఏకంగా బరితెగించేశావు పో..నీకు చై సరిపోవడం లేదు..అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. అయితే ఇవన్నీ ఏం పట్టించుకోని సమంత తన పని తాను చూసుకుంటూ సినిమాలకు సైన్ చేసుకుంటూ కెరీర్ లో బిజీగా ఉంది.

నిజానికి సమంతకు చైతూ అంటే ప్రాణం. తన మీద ఉన్న ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు సామ్‌. చైతన్య గుర్తుగా సమంత ఒంటి మీద మూడు టాటూలు కూడా వేయించుకుంది. తనకు చై ని ఇచ్చిన ఏం మాయ చేసావే సినిమా పేరుకు షార్ట్ ఫామ్‌ YMC అనే అక్షరాలు తన మెడ వెనుక భాగంలో టాటూ రూపంలో వేయించుకున్న సామ్‌.. ఇద్దరూ కుడిచేతి మణికట్టు భాగంలో యారో మార్క్స్‌ను ఒకే రకంగా టాటూ వేయించుకున్నారు.

అంతేకాదు సీక్రెట్‌ గా తన భర్త సంతకాని టాటూ రూపంలో తన నడుము మీద వేయించుకుంది. మరి చైతన్య మీద ఇంత ప్రేమ ఉన్న ఈమె ఎందుకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిందనేదు మిలియన్ డాలర్ల ప్రశ్న లా మిగిలిపోయింది. అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా సమంత రీసెంట్ గా తన ఇన్స్టా అకౌంట్ లో “Chaysam Forever” అంటూ రాసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. చైతన్య మరో స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో సమంత ఇలా కామెంట్స్ పెట్టడం సంచలనంగా మారింది. మరి చూడాలి దీని పై చైతన్య ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news