Moviesబాలయ్య కోసం బోయపాటి అఘోరా పాత్రను ఎలా డిజైన్ చేశాడంటే..?

బాలయ్య కోసం బోయపాటి అఘోరా పాత్రను ఎలా డిజైన్ చేశాడంటే..?

యువరత్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా అఖండ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. బాలయ్య అఖండ సినిమా తరువాత బాక్స్ ఆఫిస్ వద్దకు చాలా సినిమాలు వచ్చినా అవి ఏవి కూడా బాలయ్య స్పీడ్ ను తట్టుకోలేకపోయాయి. అఖండ సినిమా ముందు స్టార్ హీరోల సినిమాలు చిన్నబోయాయి అనే చెప్పాలి. అఖండ సినిమా రిలీజైన రోజు నుంచి నేటి వరకు వరుస పెట్టి రికార్డ్ ల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ఏంటో మరోసారి అభిమానులకు తెలిజేసింది ఈ సినిమా. ఈ సినిమా పై నందమూరి అభిమానులు పెట్టుకున్న అంచనాలను నూటికి నూరు శాతం అందుకుఉన్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

గతేడాది డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్ప‌టికే 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ సినిమాను తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. థియేట‌ర్ల‌లో సినిమా ఎన్ని రికార్డుల‌ను క్రియేట్ చేసిందో.. హాట్‌స్టార్‌లో కూడా అదే రేంజ్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఇక ఇప్ప‌టికే అఖండ సినిమాకు ఎవ్వరు ఊహించని విధంగా భారీ స్థాయిలో వ్యూస్ వ‌చ్చాయి. దీంతో ఈ సినిమా మేకింగ్ వీడియోను హాట్‌స్టార్ త‌న యూట్యూబ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఇక ఈ వీడియోని చూసిన ఎవ్వరైన సరే బాలయ్య ఈ సినిమాకి పడిన కష్టాని చూసి ఆశ్చర్యపోతున్నారు.

ప్రతి సీన్ తెర పై ఇంత బాగా రావడనైకి బోయపాటి, బాలయ్య ఇన్ని గంటలు కష్టపడ్డారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో కమెంట్స్ బాక్స్ మొత్తం జై బాలయ్య…అంటూ నిండిపోయింది. యాక్షన్‌ సన్నివేశాలను బోయపాటి ఎంత శ్రద్ధతో తెరకెక్కించారో మేకింగ్ వీడియోలో చూపించారు. మధ్యమధ్యలో మురళీ కృష్ణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా మనకు కొన్ని కనిపిస్తాయి. ఇక ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఓ సందర్భంలో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా వచ్చారు. ఈ మేకింగ్ వీడియో బ్యాగ్రౌండ్ లో చక్కడి శివుడి పాటను ప్రేక్షకులకు అందించారు. మొత్తానికి అఖండ ఇటు వెండితెరపై.. అటు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news