Moviesన‌ల్లగా ఉన్నావంటూ ఛాన్సులివ్వ‌లేదు... ఆ ద‌ర్శ‌కుల‌పై డింపుల్ హ‌య‌తీ బాంబ్‌..!

న‌ల్లగా ఉన్నావంటూ ఛాన్సులివ్వ‌లేదు… ఆ ద‌ర్శ‌కుల‌పై డింపుల్ హ‌య‌తీ బాంబ్‌..!

టాలీవుడ్ దేశం మెచ్చే సినిమాలు చేస్తోంది. తెలుగు సినిమా మార్కెట్ ఎంతో పెరిగింది. అయితే తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిల‌కు మాత్రం ఛాన్సులు రావ‌డం లేదు. తెలుగు అమ్మాయిల‌కు ఒక‌టీ అరా ఛాన్సులు వ‌చ్చినా వారు స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకోవ‌డం లేదు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో సూప‌ర్ హిట్టు సాంగ్‌లో న‌టించి బాగా పాపుల‌ర్ అయ్యింది డింపుల్ హ‌య‌తీ. ఆ పాట‌లో ఆమె వేసిన మాస్ స్టెప్పులు ఇంకా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో తిరుగుతూనే ఉన్నాయి.

తాజాగా డింపుల్ హ‌య‌తీకి మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ్ ఖిలాడీ, విశాల్ సామాన్యుడు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వ‌చ్చింది. ఈ రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న్స్‌లో డింపుల్ బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు త‌న కెరీర్‌లో ఎదురైన కొన్ని ఇబ్బందులు కూడా రివీల్ చేసింది.

వ‌రుణ్‌తేజ్ ప‌క్క‌న తాను న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో సూప‌ర్ హిట్ సాంగ్ సూప‌ర్ హిట్ అయ్యాక త‌న‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని.. అయితే స్పెష‌ల్ సాంగ్స్‌తో పాటు ప్ర‌యార్టీ లేని కేర‌క్ట‌ర్లు చేయ‌డం ఇష్టం లేక కొన్నింటిని వ‌దులుకున్నాన‌ని చెప్పింది. అయితే ఖిలాడీ డైరెక్ట‌ర్ ర‌మేష్‌వ‌ర్మ త‌న ఫొటోలు చూసి టెస్ట్‌లో న‌చ్చ‌డంతో ఈ సినిమాకు ఓకే చేశార‌ని డింపుల్ చెప్పింది.

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌కు త‌గిన గుర్తింపు ఉంటుంద‌ని చెప్పిన డింపుల్‌… గ‌తంలో ఛాన్సుల కోసం కొన్ని సినిమా ఆఫీస్‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కొంద‌రు ద‌ర్శ‌కులు తాను న‌ల్ల‌గా ఉన్నాన‌ని… ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయిలు కావాల‌ని చెప్పేవార‌ని డింపుల్ చెప్పింది. ఓ పెద్ద డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేశాన‌ని.. త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింద‌న్న డింపుల్‌.. త‌న కుటుంబంలో వారంతా నృత్యాకారులే అని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news