Moviesసుకుమార్ ని ఆ డైరెక్టర్ అంత దారుణంగా అవమానించాడా..?

సుకుమార్ ని ఆ డైరెక్టర్ అంత దారుణంగా అవమానించాడా..?

తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులలో సుకుమార్ కూడా టాప్ లిస్టులో ఉంటారు. ఇక సుకుమార్ తెరకెక్కించే సినిమాల గురించి..ఆయన పనితనం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లెక్కల మాస్టారుగా కధ అన్నీ పక్కాగా కరెక్ట్ గా నే చేస్తారు. ఇక ఆయన తీఇసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాని అందుకోవడమే కాకుండా..కలెక్షన్స్ పరంగా కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తాయి అనే పేరుంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప కూడా అదే విషయాని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా అల్లు అర్జున్ , సుకుమార్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకోల్పింది. ఇక పుష్ప సినిమా సక్సెస్ తో సుకుమార్ పలు ఇంటర్వ్యుల్లో బిజీ గా ఉన్నాడు. ఇక రీసెంట్ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..సుకుమార్ డైరెక్టర్ మణిరత్నం గురించి ఎవ్వరు ఊహించని కామెంట్స్ చేసారు.

ఆయన మాట్లాడుతూ..”నాకు మణిరత్నం అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే ఆయన తెరకెక్కించిన నాగార్జున గీతాంజలి సినిమాను చూసే నేను దర్శకుడిగా మారాలి అనుకున్నా.ఈ క్రమంలోనే ఆర్య సినిమా తర్వాత ఒకసారి ముంబైలో మణిరత్నం ని కనిపిస్తే ఆయనతో మాట్లాడేందుకుట్రై చేసా. ఇక అదే టైంలో నటి శోభన తో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత సార్ అంటూ దగ్గరికి వెళ్లా. అమ్య్తే ఒక్కసారిగా అప్పుడు ఆయన కోపంగా నా వైపు చూస్తూ వెళ్లు అంటూ చేతితో సైగ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆయనని మీట్ అవ్వలేదు. ఆయన చేసింది తప్పు అని నేను అనను ఎందుకంటే ఓ డైరెక్టర్ గా ఆయన పరిస్ధితి అర్ధం చేసుకున్న్. కానీ ఎందుకో తెలియదు అది నన్ను చాలా బాధపెట్టింది” అని చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news