Movies2021 లో సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ వీరే..!!

2021 లో సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ వీరే..!!

మారుతున్న కాలనికి అనుగుణంగా సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక గా మారిపోయింది. ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లు వాటిలో సోషల్ మీడియా యాప్ లు. ఇక ప్రపంచం అంతా మా చేతుల్లోనే ఉందనే బావన నేటి యువతలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. టెక్నాలజీ అభివృద్ది చెందడంతో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. యువత మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

prostitution-social-media

ఇక్కడ మనం అర్ధంచేసుకోవాల్సిన విషయ, ఏంటంటే.. ఈ సోషల్ మీడియా వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. మంచి కి ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది. ఇక చెడు పనులకు ఉపయోగించుకుంటే చెడు జరుగుతుంది.ఉదయం నిద్రలేవగానే వాట్సప్ ఓపెన్ చేసి కామెంట్లు, ఫేస్ బుక్ లో లైక్స్ చూడనిదే చాలామంది కుర్రకారుకు రోజు మొదలవ్వదు. రోజంతా ఉద్యోగంతోనే ….వ్యాపారంతోనే ఎంతగా అలసిపోయినా నిద్రపోయే ముందు ఒకసారి స్మార్ట్ ఫోన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ చేసి ఫేస్ బుక్ , వాట్సప్ చూడాల్సిందే. అంతగా సోషల్ మీడియాకు యువత ఫిదా అయింది.

అయితే ఇదే క్యాష్ చేస్కున్న కొందరు యువత దీని ద్వారానే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు.సోషల్ మీడియాను ఉపయోగించుకుని గతంలో ఎన్నడూ లేనంతా తమ బిజినెస్ ను డెవలప్ చేసుకుంటున్నారు కొందరు స్టార్స్. కరోనా మహమ్మారి పుణ్యమా అని.. వెబ్ సిరీస్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చిన్న చిన్న నటీనటులు తెగ క్రేజ్ సంపాదించుకున్నారు. వెబ్ సిరీస్ వలన యూట్యూబ్‏లో రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్లు ఉన్నారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ వీరే..!!

షణ్ముఖ్‌ జస్వంత్‌ (సూర్య): సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వెబ్‌ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న నటుడు షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్‌ సిరీస్‌తో మరింత క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

30 వెద్స్ 21- అనన్య: 30 ఏళ్ల బ్యాచిలర్‏కు 21 ఏళ్ల యువతికి వివాహం జరిగితే వారి మధ్య భావోద్వేగాలు.. చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‏తో వచ్చి నెటిజన్లకు ఆకట్టుకుంది 30 వెడ్స్ 21. ఇందులో నటించిన తెలుగమ్మాయి అనన్య కుర్రాళ్ల కళల రాకూమారిగా మారింది.

మౌనిక రెడ్డి (సూర్య): సూర్య వెబ్‌ సిరీస్‌తో అనేక అభిమానులను సంపాదించుకుంది మౌనిక రెడ్డి. ఇందులో సూర్య సరసన అంజలి పాత్రలో నటించి మెప్పించింది.

అలేఖ్య హారిక: తెలంగాణ యాసతో..మాస్ అమ్మాయిగా యూట్యూబ్ వీడియోలతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక. దేత్తడి ఛానల్‏లో అలేఖ్య చేస్తున్న వీడియోలకు ఎక్కువగానే క్రేజ్ ఉంది.

గంగవ్వ: గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. ఆరుపదుల వయసులో ప్రపంచానికి స్టార్‏గా పరిచయమైంది గంగవ్వ. షార్ట్ ఫిల్మ్స్‏లో నటించిన గంగవ్వ ఇప్పుడు వెండితెరపై తన నటనతో ఆకట్టుకుంటుంది.

అనిల్‌ గీలా: మై విలేజ్ షోతో ప్రేక్షకులకు చేరువైన మరో నటుడు అనిల్‌ గీలా. మంచి ఉపాధ్యాయుడిగా రాణిస్తూనే యూట్యూబ్‌లోని తన సత్తా చాటాడు. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్‏లో అనిల్ గీలా వోల్గ్స్ అనే ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు మై విలేజ్ షోలో షార్ట్ ఫిల్మ్ చేస్తూ.. వెండితెరపై కూడా తన నటనతో ఆకట్టుకుంటూ యూత్ ఐకాన్‏గా నిలిచాడు అనిల్.

30 వెద్స్ 21- చైతన్య రావు:30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‏లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్‌ అయ్యాడు చైతన్య. నటనపై ఆసక్తితో వచ్చిన చైతన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‏తో సూపర్ హిట్ అందుకున్నాడు చైతన్య.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news