Moviesవ‌ర‌ల్డ్‌లోనే ' అఖండ ' ఫ‌స్ట్ షో అక్క‌డే... అప్పుడే ర‌చ్చ...

వ‌ర‌ల్డ్‌లోనే ‘ అఖండ ‘ ఫ‌స్ట్ షో అక్క‌డే… అప్పుడే ర‌చ్చ మొద‌లైంది..!

యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ప్ర‌గ్య జైశ్వాల్ నటించింది. సినీ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర‌లో నటించిన జగపతి బాబు, పూర్ణ‌, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న అఖండ సినిమా హడావుడి ఈరోజు నుంచే మొదలైపోయింది.

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో 2014 సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఆ ఎన్నికలకు ముందు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల‌లో సరి కొత్త జోష్ నింపింది. మళ్లీ ఏడున్న‌ర‌ సంవత్సరాలకు అదే కాంబినేషన్లో సినిమా రిపీట్ అవుతుండడంతో నందమూరి అభిమానులు ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశ‌ల‌తో ఉన్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అఖండ ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు లేకపోవడంతో తెలంగాణలోనే ముందు బెనిఫిట్ షోలు పడుతున్నాయి. ఇక హైద‌రాబాద్‌లో ముందుగా భ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లిఖార్జున థియేట‌ర్ల‌లో బెనిఫెట్ షోలు వేస్తున్నారు. ఇక అఖండ ఫ‌స్ట్ బెనిఫిట్ షోలు యూఎస్‌లో స్టార్ట్ అవుతున్నాయి.

యూఎస్‌లో గ‌తంలో బాల‌య్య సినిమాల‌కు ఎప్పుడూ లేని విధంగా 500 స్క్రీన్ల‌లో అఖండ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 1వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచే అఖండ గ‌ర్జ‌న స్టార్ట్ కానుంది. అప్ప‌టి నుంచే ప్రీమియ‌ర్ షోలు వేయ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news