Moviesపెళ్లి అయ్యాక ఆ హీరోయిన్ లైఫ్ ఇలా మారిపోయిందేంటి..!

పెళ్లి అయ్యాక ఆ హీరోయిన్ లైఫ్ ఇలా మారిపోయిందేంటి..!

వెండితెరపై ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు… ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరం అయిపోతారు. ఈ క్రమంలోనే భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వారు చేసిన పాత్రలపై ప్రేమ పెంచుకున్న‌ ప్రేక్షకులు.. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా వారిపై అభిమానం మాత్రం వదులుకోరు. ఈ కోవలోకే వస్తారు ఒకప్పటి హీరోయిన్ లయ. 1999వ సంవత్సరంలో తొట్టెంపూడి వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో తెలుగు వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది లయ.

కృష్ణా జిల్లాలోని విజయవాడకు చెందిన లయ అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత అందానికి తోడు… అభినయం కూడా ఉండడంతో వచ్చీరావడంతోనే ఇండస్ట్రీలో వరుసగా జగపతిబాబు – బాలయ్య – శివాజీ – జేడీ. చక్రవర్తి లాంటి స్టార్ హీరోలతో నటించి తక్కువ సమయంలోనే స్టార్ డ‌మ్‌ దక్కించుకున్నారు. తన కెరీర్లో 30కి పైగా సినిమాల్లో నటించిన లయ 2006లో అమెరికాలో సెటిల్ అయిన గణేష్ గొర్తి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు.

ల‌య‌కు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి… మంచి పాత్రలు వస్తున్నా ఆమె ఎందుకోగానీ సినిమా రంగంపై ఆసక్తి చూపించడం లేదు. అయితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులకు తీపి గుర్తులు ఇస్తున్నారు, ఈ క్రమంలోనే లయ తన ఇన్‌స్టా ఖాతాలో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేయగా… వాటిని ఆమె అభిమానులు లైక్ చేయడంతో పాటు… తిరిగి తెలుగు సినిమాల్లోకి ఎప్పుడు ? ఎంట్రీ ఇస్తారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

లయ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరో చిన్న‌ప్ప‌టి త‌ల్లి పాత్ర‌ వేశారు. ఆ తర్వాత కూడా ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నా… ఆమె ఎందుకోగానీ నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news