Moviesచైతు - సామ్ విడాకుల‌కు అదే కార‌ణ‌మా..మ‌ళ్లీ కొత్త సందేహాలు..!

చైతు – సామ్ విడాకుల‌కు అదే కార‌ణ‌మా..మ‌ళ్లీ కొత్త సందేహాలు..!

అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ సమంత ఏడెనిమిది సంవత్సరాలుగా ఎంతో గాఢంగా ప్రేమించుకుని నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య జీవితంలో ఏర్పడిన మనస్పర్థలతో వీరు రెండు నెలల క్రితమే విడాకులు తీసుకున్నారు. వీరి దాంపత్య జీవితాన్ని చూసి చాలామంది తాము కూడా ఇంతలా రొమాంటిక్ క‌ఫుల్స్‌గా ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వీరిద్దరూ కలిసి విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పారు. అసలు వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. విడాకుల తర్వాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.. విడాకుల విష‌యంలో మాత్రం ఎవరు కూడా స్పందించలేదు.

అయితే నాగచైతన్య తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్లు మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అనేక ప్రశ్నలకు సందేహాలుగా మారాయి. ఇప్పుడు చైతు చెప్పిన ఆ విషయమే విడాకులకు కారణం అయి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో మరో కొత్త చ‌ర్చ‌గా మారింది. చైతన్య కొత్త పాత్ర‌లు… కొత్త కథలతో అడుగులు వేస్తున్నారు. చైతు తాజా హిట్ లవ్ స్టోరీ సినిమా కూడా చాలా కొత్తగానే ఉంటుంది. అందుకే చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో మంచి హిట్ పడింది.

చైతు మాట్లాడుతూ తాను ఏ పాత్ర అయినా చేస్తానని… అయితే ఆ పాత్రలో తన కుటుంబాన్ని, తన ప్రతిష్టను… ప్రభావితం చేయకూడదు… వారికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పాడు. వారికి ఇబ్బంది క‌లిగించ‌కూడ‌ద‌న్న‌దే త‌న ల‌క్ష్యం అని చెప్పాడు. అక్క‌డి వ‌ర‌కు ఓకే. అయితే ఈ వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే ప‌రోక్షంగా అక్క‌ర్లేదు.. ప్ర‌త్య‌క్షంగానే స‌మంత‌కు త‌గిలేశాయి. స‌మంత పెళ్ల‌య్యాక ఎంత‌లా బోల్డ్‌గా రెచ్చిపోయిందో చూశాం.

ఆమె ప్రైవేటు ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చిన‌ప్పుడు, ఇంట్లో ఫంక్ష‌న్ల‌లో కూడా కాస్త సంప్ర‌దాయం లిమిట్స్ క్రాస్ చేసిన డ్రెస్సులు వేసుకునే వ‌చ్చేది. కొన్ని మ‌రీ శృతిమించి హ‌ద్దులు మీరిన‌ట్టు ప్ర‌వ‌ర్తించేది. ఆమె చేసిన వెబ్‌సీరిస్‌లు చూస్తుంటేనే ఆమె ఇంకా స్టార్ హీరోయిన్‌నే అన్న భ్ర‌మ‌ల్లోనే ఉంద‌నే అనిపించింది. అంతేకాని ఆమె త‌న‌కు పెళ్ల‌య్యింద‌ని.. ఓ భ‌ర్త ఉన్నాడ‌న్న విష‌యం వ‌దిలేసిన‌ట్టే అనిపించేది.

పైగా తాను పెద్ద సంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన ఫ్యామిలీ కోడ‌లిని అన్న విష‌యం కూడా స‌మంత విడాకుల‌కు ముందే వ‌దిలేసింది. స‌మంత‌కు అక్కినేని కుటుంబం ఫ్రీడం ఇచ్చింది.. అయితే దానిని మ‌రింత స్వేచ్ఛ‌గా ఆమె వాడుకుని.. వారిని లెక్క చేయ‌నంత‌గా ఆమె వ్య‌వ‌హ‌రించిందా ? అంటే ఆమె వేసిన పాత్ర‌లు.. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆమె డ్రెస్సులు.. ఆమె ఫ్రెండ్స్‌, చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణ‌మే అవున‌ని చెప్పేలా ఉన్నాయి.

ఇక ఇప్పుడు చైతు రైజ్ చేసిన కొత్త ప్ర‌శ్న‌లు కూడా అనేక సందేహాలు లేవ‌నెత్తుతున్నాయి. విడాకుల త‌ర్వాత మాత్రం స‌మంత చేసిందేంటి ? పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో ఆమె ఎంత ర‌చ్చ చేసిందో చూశాం. స‌మంతకు సంప్ర‌దాయ బ‌ద్ధంగా ఉండ‌డం, త‌న స్వేచ్ఛ‌కు ప‌రిమితులు పెట్ట‌డం న‌చ్చ‌దు. అదే ఆమె విడాకుల కార‌ణాల్లో ప్ర‌ధాన‌మైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news