Moviesభీమ్లా నాయ‌క్ అడ‌వి త‌ల్లి సాంగ్ అదిరిపోయింది.. (వీడియో)

భీమ్లా నాయ‌క్ అడ‌వి త‌ల్లి సాంగ్ అదిరిపోయింది.. (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కాంబోలో వ‌స్తోన్న సినిమా భీమ్లా నాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప కోషియ‌మ్‌క రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కంప్లీట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కు సంబంధించి ఇప్ప‌టికే వ‌చ్చిన టీజ‌ర్లు, స్టిల్స్‌, ట్రైల‌ర్లు అన్ని కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఈ క్ర‌మంలోనే మేక‌ర్స్ కూడా ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ ప‌రంప‌ర‌లోనే ఈ రోజు ఈ సినిమాలో నాలుగో సాండ్ అడ‌వి త‌ల్లి పాట రిలీజ్ చేశారు.

ముందుగా స్వ‌ర్గీయ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిని స్మ‌రించుకుంటూ ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. మొగిలియ్య పాడిన భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ ఎంత హైప్ తెచ్చిందో ఇప్పుడు ఈ సాంగ్ కూడా సినిమాకు అంతే హైప్ తెచ్చింది. దుర్గవ్వ మరియు సాహితిల గాత్రంతో ప‌వ‌ర్ ఫుల్ ప‌దాల‌తో సాంగ్ తెర‌కెక్కింది. చాలా ఎమోష‌న్‌గా సాంగ్ ఉండ‌బోతోంద‌ని సాంగ్ వింటుంటూనే మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది.

రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం, థ‌మ‌న్ సంగీతం అన్ని కూడా అద్భుతంగా కుదిరాయి. ఈ సాంగ్‌లో మ‌రో హైలెట్ ఏంటంటే రానా – ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంతాలు ఎలా ఉంటాయో కూడా చూపించారు. అయితే ఇందులో కొన్ని మాస్ విజువ‌ల్స్ కూడా చూపించారు. బంధాలు, బాంధ‌వ్యాల‌కు కూడా సినిమాలో ఎంత స్కోప్ ఉంటుందో ఈ సాంగ్‌తో చెప్ప‌క‌నే చెప్పేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news