Moviesనా చావుకి కారణం యూవీ క్రియేషన్స్.. ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్..!!

నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్.. ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్..!!

చాలా బలమైన కారణాలతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు ఈ ప్రపంచంలో బలమైన సమస్య అంటూ ఏదీ లేదు. కూర్చుని పరిష్కరించుకుంటే జీవితాన్ని చక్కగా జీవించవచ్చు. కానీ కొందరు అత్యంత మూర్ఖంగా సిల్లీ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్ళ కడుపుకోత మిగిలిస్తున్నారు. హీరోల కోసం ప్రాణాలిచ్చేంత అభిమానం వుండాలి కానీ ప్రాణాలు తీసుకునేంత కాదని ఎప్పుడు తెలుసుకుంటారో ? ప్రభాస్ తాజా సినిమా ‘రాధే శ్యామ్’ సినిమా నుండి ఎలాంతి అప్డేట్ లేదని మనస్తాపం చెందిన ప్రభాస్ అభిమాని ఒకరు సూసైడ్ నోట్ రాయడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ప్రభాస్ అభిమాని తన సూసైడ్ లేఖలో ఏం రాశారు? ఎందుకు రాశారనే విషయంలోకి వెళితే..

అందులో.. సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమానిగా తన ఆవేదనను తెలిపాడు.

కనీసం తన చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్డేట్ ఇస్తారని అనుకొంటున్నానని అభిమాని లేఖలో మరింత భావోద్వేగానికి లోనయ్యారు. చాలా రోజులు వేచి చూసేలా చేశారని.. ఇంక వెయిట్ చేసింది చాలని పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా తన చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్ మరియు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ అని మెన్షన్ చేసాడు. చివర్లో చిన్న మనవి అంటూ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు.. ఇట్లు రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ డై హార్డ్ ఫ్యాన్ విన్నవించుకొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news