Moviesసీనియ‌ర్ హీరోయిన్ క‌స్తూరికి 60 ముస‌లాడితో ల‌వ్వా...!

సీనియ‌ర్ హీరోయిన్ క‌స్తూరికి 60 ముస‌లాడితో ల‌వ్వా…!

సినిమా రంగంలో హీరో, హీరోయిన్ ల గురించి రూమర్లు రావడం కామన్. అయితే ఇటీవల సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో సినిమా వాళ్ళతో పాటు సెలబ్రిటీల గురించి విపరీతంగా గాసిప్‌లు, రూమ‌ర్లు ప్రచారం అవుతున్నాయి. ఒక వార్త సోషల్ మీడియాలో బయటకు వచ్చింది అంటే అది జనాల్లోకి తొందరగా వెళ్ళిపోతోంది. అసలు నిజం ఏంటనేది మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి రూమ‌ర్లు ఓ సీనియ‌ర్‌ హీరోయిన్‌ను ఎంతో బాధ‌పెట్టాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది.

తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో నటించిన కస్తూరి శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అన్నమయ్య తర్వాత కస్తూరి మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. ఈ క్రమంలోనే బుల్లితెరపై నటిగా మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని చెన్నైలో ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా కస్తూరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే తమిళ సినిమా పరిశ్రమలో ఉన్న ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో కస్తూరికి లవ్ ఎఫైర్ ఉందని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది.

దీనిపై స్పందించిన ఆమె ఆ వ్యాపారవేత్త వయస్సు 60 సంవత్సరాలు పైనే ఉంటుందని… ఆయనతో తనకు ఎఫైర్‌ వుందని ప్రచారం జరుగుతుడడం న‌వ్వు తెప్పిస్తోంద‌ని చెప్పింది. తానంటే గిట్ట‌ని వాళ్లే ఈ ప్రచారం చేశారని ఆమె వాపోయింది. కస్తూరి ఆ వ్యాపారవేత్త పేరు చెప్పకపోయినా అతడికి 60 సంవత్సరాల పైన వయసు ఉంటుంది అని మాత్రం హింట్‌ ఇచ్చింది.

సినిమాలకు దూరమైన కస్తూరి బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన గృహలక్ష్మి సీరియల్ చాలా పాపులర్ అయ్యింది. అలాగే తమిళ బుల్లితెరపై కూడా క‌స్తూరి నటిస్తున్న సీరియల్స్‌కు విశేషమైన ఆదరణ లభిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news