Moviesబిగ్ బాస్ లో సజ్జనార్‌ సపోర్ట్ ఆయనకే.. ఏదో తేడాకొడుతుందే..?

బిగ్ బాస్ లో సజ్జనార్‌ సపోర్ట్ ఆయనకే.. ఏదో తేడాకొడుతుందే..?

ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ 10వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. దీంతో హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఎవ్వరికి వారు గేం బాగానే ఆడుతున్నారు కానీ వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ చాల గట్టిగానే ఉంది అని చెప్పాలి.

ఇప్పటికే టాలీవుడ్ బ్యూటి పాయల్, బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవాలంటూ శ్రీరామ్‌కు తన మద్దతు ప్రకటించగా తాజాగా ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా అతడికి సపోర్టుగా నిలవడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో గురించి ఆయన మాట్లాడుతూ.. శ్రీరామచంద్రకు సపోర్ట్ ఇచ్చారు.

బిగ్‏బాస్ షోలో తన మద్దతు ఎవరికనేది తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో సజ్జనార్ మాట్లాడుతూ.. బిగ్‏బాస్ ఇంట్లో శ్రీరామ్ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్ గెలుస్తాడనే నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామచంద్ర ఫాలోవర్స్ సజ్జనార్‏కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే సజ్జనార్‌కు ఏదో స్క్రిప్ట్ ఇస్తే.. చదివేసినట్టు అనిపిస్తోంది. ఏమైనా సరే మొత్తానికి సజ్జనార్ మాత్రం శ్రీరామచంద్రకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించేశాడు. దీంతో ఆయన అభిమాను ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి చూడాలి శ్రీరాం బిగ్ బాస్ విన్నర్ అవుతాడా లేడా అనేది..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news