Moviesదాక్షాయనిగా అనసూయ లుక్ .. ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు...

దాక్షాయనిగా అనసూయ లుక్ .. ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు సుకుమార్..?

‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకుగా డిసెంబర్‌17న విడుదల కానుంది.అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు..ఫస్ట్ లుక్స్.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశాయి.

ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో సుకుమార్ ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసారు. ఈ క్రమంలో భాగంగా రీసెంట్ గా జబర్ధస్త్ బ్యూటి అనసూయ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. దాక్షాయణిగా అనసూయ లుక్ అందరికి నచ్చేసింది. నిజం చెప్పాలంటే అనసూయ కెరీర్ ను ఈ పాత్ర మలుపు తిప్పుతుందనే చెప్పాలి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అందరిని మెప్పించిన అనసూయ.. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో దాక్షాయణిగా నటిస్తుంది.

 

ఈ సినిమాలో అనసూయ సునీల్ కు భార్య గా నటిస్తుంది. ఇక పుష్ప సినిమా నుండి రిలీజ్ అయిన అనసూయ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందరు అనసూయ లుక్స్ కి ఫిదా అయిపోయారు. దాక్షాయనిగా అనసూయ.. నోట్లో ఆకు నములుతూ.. మాస్ లుక్ లో..చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతున్నట్లు మనం చ్హుడవచ్చు. అయితే అనసూయ ను పరిచయం చేసే విధానంలో సుకుమార్ నెటిజన్స్ కు అడ్డంగా దొరికిపోయారు. అనసూయ ఉన్న పోస్టర్ లో ఆమెను దాక్షాయనిగా పరిచయం చేస్తూ పోస్టర్ రిల్లిజ్ చేసారు. ఒకేఅ బాగానే ఉంది కానీ.. ముందు రోజు మాత్రం ఆమెను ద్రాక్షాయనిగా పుషప సినిమాలో నటిస్తున్నట్లు పరిచయం చేస్తున్నట్లు పోస్ట్ చేసారు.

 

ఇక అక్కడే సుకుమార్ ని నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ సినిమా తీస్తున్న సుకుమార్ కనీసం ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరా.. అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా మరి కొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ సుకుమార్ ప్లానింగ్ ను మెచ్చుకుంటున్నారు. ఇది పొరపాటున జరిగిందో లేక కావలని పబ్లిసితీ కోసం చేసారో తెలియదు కానీ అనసూయ లుక్ అద్దిరిపోయిందంటున్నారు మరి కొంతమంది నెటిజన్స్. ఈ సినిమా తరువాత అనసూయ సినీ కెరీర్ ఖచ్చితంగా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది అంటూన్నారు పలువురు ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news