Moviesవిఘ్నేష్‌ను గ‌ట్టిగా హ‌త్తుకున్న న‌య‌న్‌... బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ అదిరిపోలే...!

విఘ్నేష్‌ను గ‌ట్టిగా హ‌త్తుకున్న న‌య‌న్‌… బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ అదిరిపోలే…!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన 39 వ పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా జరుపుకుంటోంది. తాజాగా ఆమె పుట్టినరోజును ఆమె ప్రియుడు, యువ దర్శకుడు విగ్నేష్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఇక గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా ? అని సౌత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తన ప్రియురాలు బర్త్ డే కోసం విఘ్నేష్ పెద్ద పార్టీ ఎరేంజ్ చేశాడు. రాత్రి 12 గంటలకు జరిగిన ఈ పార్టీలో చాలా తక్కువ మంది మాత్రమే పాల్గొన్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ పార్టీకి హాజరైంది.

న‌య‌న్ అంటూ ఇంగ్లీష్ అక్ష‌రాల‌తో త‌యారు చేసిన పెద్ద కేక్ తీసుకువ‌చ్చారు. భారీ ఎత్తున ట‌పాసులు కాల్చ‌డంతో పాటు కేక్ క‌ట్ చేయించారు. ఈ ఏర్పాట్ల‌తో షాక్ అయిన న‌య‌న్ కేక్ క‌ట్ చేయ‌డానికి ముందు ప్రియుడు విఘ్నేష్‌ను గ‌ట్టిగా వాటేసుకుంది. ఇక నానుమ్ రౌడీదాన్ సినిమా స‌మ‌యంలో వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారిపోయింది. ఆ త‌ర్వాత ఎక్క‌డ చూసినా ఈ జంటే జంట‌గా క‌నిపిస్తున్నారు.

ముందు వీరు ప్రేమ విష‌యంలో చాలా సీక్రెట్‌గా ఉన్నారు. అయితే త‌ర్వాత ఓపెన్ అయిపోయారు. అయితే న‌య‌న్ 39వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నా కూడా ఇప్ప‌ట‌కీ కూడా ప్రియుడిని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటోంది. వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో పాటు స్టార్ డ‌మ్ ను వ‌దులు కునేందుకు ఇష్టంలేకే న‌య‌న్ పెళ్లిని వాయిదా వేస్తూ వ‌స్తోంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు ఆమె అభిమానులు మాత్రం న‌య‌న్ త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని కోరుతున్నారు. ఇక‌న‌య‌న్ ప్ర‌స్తుతం కోలీవుడ్ సినిమాల‌తో పాటు షారుక్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. అట్లీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news