Moviesజై బాల‌య్య సాంగ్‌... క‌ళ్యాణ్‌రామ్ సూప‌ర్ రియాక్ష‌న్‌

జై బాల‌య్య సాంగ్‌… క‌ళ్యాణ్‌రామ్ సూప‌ర్ రియాక్ష‌న్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో వ‌స్తోన్న అఖండ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబోలో అఖండ ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

ఇక శ‌నివారం రాత్రి ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు గెస్టులుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో పాటు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వ‌చ్చారు. ఈ ఇద్ద‌రు ఈ షోకు మ‌రింత ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఇక నంద‌మూరి – అల్లు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. ఈ ఈవెంట్‌లో బ‌న్నీ అఖండ‌కు సంబంధించి రెండో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్లు, టీజ‌ర్లు చూస్తుంటే సినిమా అంతా మాస్ జాత‌ర అని తేలిపోతోంది.

ఈ సంద‌ర్భంగా సినిమాలో జై బాల‌య్య సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సాంగ్ చూస్తుంటే బాల‌య్య‌ను కుర్ర ఏజ్‌లో చూసిన‌ట్టుగా ఉంద‌ని ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నంద‌మూరి హీరో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ కూడా ఈ సాంగ్‌పై స్పందించారు.

జై బాల‌య్య‌, బాల‌య్య ఫుల్ ఫ్లోలో ఉన్నారు. ఈ మాస్ జాత‌ర‌ను డిసెంబ‌ర్ 2 న థియేట‌ర్ల‌లో చూసే వ‌ర‌కు తాను ఆగ‌లేక‌పోతున్నాను అంటూ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. అలాగే జై బాల‌య్య సాంగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక అమెరికాలో ఈ సినిమా 500 స్క్రీన్ల‌లో రిలీజ్ అవుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news