Moviesబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా హీరోయిన్లుగా కొనసాగుతూ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పలువురు స్టార్ హీరోయిన్ల గురించి ఎవరికీ తెలియని మరికొన్ని రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. ఐశ్వర్యారాయ్ బచ్చన్:
ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఈమె తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఇలా ఏడు భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఐశ్వర్యరాయ్ కు ఉంది. ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఒక టీవీ సీరియల్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఈమె 2009 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం ఈమెను ఒర్డ్రే డెస్ ఆర్ట్స్ డెస్ లెట్టెర్స్ అవార్డుతో సత్కరించింది.

2. దీపికా పదుకొనే :
బీ టౌన్ లో ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరిన ఏకైక నటిగా గుర్తింపు పొందింది. ఇక అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కూడా ఈమెను పలు సినిమాలు మార్చాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈమెకు తినడం.. తాగడం అంటే చాలా ఇష్టమట. కానీ ఎలా తిన్నా సరే..తన ఫిగర్ లో ఏ మాత్రం వేరియేషన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేసుకోవడం గమనార్హం.

3. పరిణీతి చోప్రా:
పరిణితి చోప్రా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు భారత దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినందుకుగాను, ఈమెను రాష్ట్రపతి కూడా సత్కరించారు. పాడడం అంటే చాలా ఇష్టమట. ఇకపోతే బాలీవుడ్ లో తన కెరియర్ ప్రారంభించి ముందు మాంచెస్టర్లో ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ లో పని చేసింది.

4. ప్రియాంక చోప్రా:
మొదటిసారి 2002లో తమిజన్ అనే తమిళ చిత్రం ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత మిస్ వరల్డ్ గా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రపంచ గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. CII లో పాల్గొని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news