Moviesమాటల మాంత్రికుడి అసలు పేరేంటో మీకు తెలుసా?

మాటల మాంత్రికుడి అసలు పేరేంటో మీకు తెలుసా?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్. ఆయనకు జనాల్లో ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. రచయితగా అడుగు పెట్టి.. దర్శకుడిగా మారి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. త్రివిక్రమ్ అంటే సినిమా పరిశ్రమలో ఓ మంచి గుర్తింపుతో పాటు అందరూ ఆయనను ఇష్టపడుతారు. ఈయన తన అద్భుత డైలాగులతో సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేశాడు అని చెప్పుకోవచ్చు. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మొదలైన ఆయన నూతన ప్రస్తానం.. టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసి.. దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలతో ఆయన తీసిన సినిమాలన్నీ బంఫర్ హిట్ కొట్టాయి.

 

అటు తాజాగా ఆయన అల్లు అర్జున్ తో కలిసి తీసిన అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమా కలెక్షన్లు ఓ రేంజిలో వచ్చాయి. తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటి వరకు ఏ సినిమాకు రాని వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి.

ఈ సినిమాతో దర్శకుడిగా త్రివిక్రమ్ రేంజి ఓ రేంజికి ఎగిసింది. ప్రస్తుతం తాజాగా ఆయన కొన్ని ప్రాజెక్టుల మీద ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మహేష్ బాబుతో మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అయితే చాలా మంది ఆయనను మాటల మాంత్రికుడు అని మాత్రమే ఇండస్ట్రీలో పిలుస్తారు. కానీ ఆయనకు అసలు పేరు మరొకటి ఉంది. ఆ పేరు మాత్రం చాలా మందికి తెలియదు.

వాస్తవానికి త్రివిక్రమ్ అసలు పేరు.. ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. ఆయన సొంతూరు భీమవరం. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెల్సీ పూర్తి చేశాడు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బంగారు పతకం అందుకున్నాడు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్లు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. రచయితగా మారాడు. నెమ్మదిగా దర్శకుడిగా మారి మెగా ఫోన్ అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news