Moviesఅందరివాడు ఫెయిల్యూర్.. ముందే విషయం తెలిసినా చిరంజీవికి చెప్పే ధైర్యం చేయలేకపోయాడా?

అందరివాడు ఫెయిల్యూర్.. ముందే విషయం తెలిసినా చిరంజీవికి చెప్పే ధైర్యం చేయలేకపోయాడా?

అందరివాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా. 2005లో ఈ సినిమా విడుదదల అయ్యింది. శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చిరంజీవి డబుల్ యాక్షన్ చేశాడు. కొడుకు, తండ్రి పాత్రలు పోషించాడు. కథ నచ్చడంతో శ్రీను వైట్లను దర్శకత్వం చేయాలని చెప్పాడు చిరంజీవి. నిజానికి శ్రీనుకు ఈ సినిమా అంతగా నచ్చలేదు. వాస్తవానికి చిరంజీవితో దర్శకత్వం చేసే అవకాశం వస్తే.. తనకు నచ్చిన కథతో సినిమా తీయాలి అనుకున్నాడు శ్రీను. కానీ కథ నచ్చకుండానే ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఆయన టాలీవుడ్ లో టాప్ స్టార్ కావడం మూలంగానే ఈ సినిమాకు నో చెప్పలేకపోయానన్నాడు శ్రీను వైట్ల. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈ టీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు శ్రీను వైట్ల. ఈ సందర్భంగా అలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. అందులో భాగంగానే అందిరివాడు ఎందుకు సక్సెస్ కాలేదు? అని అడిగాడు అలీ. ఈ ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు శ్రీను. కథ రెడీగా ఉంది. సినిమా చేయాలని చిరంజీవి నుంచి పిలుపు వచ్చిందన్నాడు. అయితే కథ తనకు అంతగా నచ్చకపోయినా సినిమా చేయాల్సి వచ్చిందన్నాడు. తను బిగ్ స్టార్ కావడం మూలంగానే నో చెప్పే ధైర్యం చేయలేకపోయినట్లు వెల్లడించాడు శ్రీను.

మొత్తంగా అందిరివాడు ఫెయిల్యూర్ అవుతుందని ముందుగానే శ్రీను వైట్ల గమనించాడు. కానీ.. ఆ విషయం చిరంజీవి చెప్పే సాహసం చేయలేకపోయాడు. మొత్తంగా కథ ఇష్టం లేకపోయినా చేసినట్లు చెప్పాడు. కథ నాకు నచ్చలేదు అని చెప్పలేకపోయాడు. ఒకవేళ చెప్తే తను ఏమనుకుంటాడా? తన కెరీర్ ఎలా మారుతుందో? అనే భావన కూడా ఈ సినిమా చేయడం వెనుక ఉండి ఉంటుంది. అందుకే చెప్పాడు చేశాను. అనే ధోరణిలో ముందుకు వెళ్లాడు. తను అనుకున్నట్లే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news