Moviesశ్యామ్ సింగ‌రాయ్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో తెలుసా...!

శ్యామ్ సింగ‌రాయ్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో తెలుసా…!

విజ‌య్ దేవ‌ర‌కొండ – ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా న‌టించిన సినిమా టాక్సీవాలా. ఈ సినిమాలో ప్రియాంక జ‌వాల్క‌ర్ అంద చందాలు కుర్ర‌కారుకు మాంచి కిక్ ఇచ్చాయి. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా రాహుల్ సంకృత్య‌న్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రాహుల్ టేకింగ్ కు ప్రేక్ష‌కుల తో పాటు సినిమా ఇండ‌స్ట్రీ వాళ్లు ఫిదా అయిపోయారు. ఈ సినిమా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాహుల్ ఇప్పుడు నాని హీరో గా సెకండ్ ప్రాజెక్టుగా శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తుంటే.. నాని ప‌క్క‌న సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టితో పాటు మ‌ళ‌యాళ న‌టి మ‌డోన్నా సెబాస్టియ‌న్ ( ప్రేమ‌మ్ ఫేం) కూడా న‌టిస్తోంది. ఈ ముగ్గురు ముద్దుగుమ్మ‌ల ప‌క్క‌న నాని ఆడి పాడుతుంటే మామూలు ర‌చ్చ కాద‌నే చెప్పాలి. ఈ సినిమాలో నానిది డ్యూయ‌ల్ రోల్ అని తెలుస్తోంది. టైటిల్ సాంగ్ వ‌చ్చిన వెంట‌నే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో ముందుగా ద‌గ్గుబాటి రానాను హీరోగా అనుకున్నార‌ట‌.

రానా ఈ క‌థ‌ను రిజెక్ట్ చేయ‌డంతో ఇప్పుడు నాని ఈ ప్రాజెక్టులోకి ఎంట‌ర్ అయ్యాడు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ శ్యామ్ సింగ‌రాయ్ రిలీజ్‌కు రెడీ గా ఉంది. నాని అయితే ఈ సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాడు. కోల్‌కొత్తా బ్యాక్ గ్రౌండ్‌తో ఈ సినిమా తెర‌కెక్కింద‌ట‌. సాయి ప‌ల్ల‌వి ఓ బెంగాలీ యువ‌తిగా క‌నిపిస్తుందంటున్నారు.

ఇక వీ, ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలో రిలీజ్ అయి ఓ మోస్త‌రుగా ఆడాయి. మ‌రి ఇప్పుడు ఈ శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో అయినా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొడ‌తాడేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news