Moviesవిడాకులకు రెడీ అవుతోన్న బాలీవుడ్ స్టార్ క‌పుల్‌...!

విడాకులకు రెడీ అవుతోన్న బాలీవుడ్ స్టార్ క‌పుల్‌…!

సినిమా రంగంలో పెళ్లిళ్లు, ప్రేమ‌లు, విడిపోవ‌డాలు మామూలు అయిపోయాయి. ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనుకున్న జంట‌లు కూడా విడిపోతూ ఉంటాయి. స‌మంత – నాగ‌చైత‌న్య జంటే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు పెళ్లి జీవితం అనుభ‌వించాక కూడా మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయింది. టాలీవుడ్‌, సౌత్‌లో అయితే ఈ ప్రేమ‌లు, పెళ్లిళ్లు, విడాకులు కాస్త త‌క్కువుగా జ‌రుగుతూ ఉంటాయి కాని.. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇది మ‌రీ కామ‌న్ అయిపోయింది. అక్క‌డ ఇండ‌స్ట్రీ వాళ్ల‌లో దాదాపు 50 శాతం మంది ప్రేమ‌లు, పెళ్లిళ్లు రెండు, మూడు సంవ‌త్స‌రాల‌కే బ్రేక‌ప్ అయిపోతున్నాయి.

తాజాగా మ‌రో బాలీవుడ్ స్టార్ క‌పుల్ విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. స్టార్ క‌పుల్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు ఎంతో ప్రేక్ష‌కాదార‌ణ పొందిన అనుప‌మ్ రామ్ – పియ దంప‌తులు ఇప్పుడు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. వీరు తాము విడాకులు తీసుకున్న‌ట్టు చెప్ప‌డంతో వీరి ఫ్యాన్స్ కూడా ఎంతో షాక్‌కు గుర‌య్యారు. ఆరు సంవ‌త్స‌రాల పాటు ఎంతో అన్యోన్య‌మైన జీవితం గ‌డిపిన ఈ జంట విడిపోవాల‌న్న నిర్ణ‌యం వీరి అభిమానుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు.

అనుప‌మ్ రామ్ స్పందిస్తూ ఆరేళ్ల త‌మ వైవాహిక జీవితం త‌మ‌కు ఎన్నో తీపిగుర్తులు మిగిల్చింద‌ని చెప్పారు. కొన్ని విబేధాల వ‌ల్ల తాము విడిపోయినా కూడా మంచి స్నేహితులుగా కొన‌సాగాల‌ని నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఎప్పుడూ మ‌ద్ద‌తు ప‌లికిన స్నేహితులు, అభిమానుల‌కు తాము ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌ని అనుప‌మ్ చెప్పారు. ఏదేమైనా బాలీవుడ్‌లో ఎంతో సెల‌బ్రిటీలుగా ఉన్న వారు కూడా చిన్న చిన్న కార‌ణాల‌కే విడిపోతూ ఉండ‌డం కామ‌న్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news