Moviesబాల‌య్య - మ‌లినేని గోపీచంద్ సినిమా ప‌వ‌ర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్...

బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ సినిమా ప‌వ‌ర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఇదే..?

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డిసెంబ‌ర్ 2వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. బాల‌య్య – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో మ‌రో సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ హీరోల‌ను మాసిజంతో ఎలివేట్ చేయ‌డంలో గోపీచంద్ మ‌లినేని కూడా అందెవేసిన చేయి.

ఈ యేడాదే గోపీచంద్ డైరెక్ట్ చేసిన క్రాక్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ర‌వితేజ కెరీర్‌లోనే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా కూడా క్రాక్ రికార్డుల‌కు ఎక్కింది. ఈ సినిమా చూసిన వెంట‌నే బాల‌య్య మ‌లినేనితో చేసేయాల‌ని వెంట‌నే ఫిక్స్ అయిపోయాడు . మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ ఈ సినిమా నిర్మిస్తోంది. శృతీ హాస‌న్ బాల‌య్య ప‌క్క‌న తొలిసారిగా జోడీ క‌డుతోంది. సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది.

ఇక ఈ సినిమా క‌థ గురించి కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఓ హింట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ క‌థ ప్లాష్ బ్యాక్ మాత్రం అమెరికా నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తోంది. చాలా ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. రెండు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌ల్లో బాల‌య్య క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇద్ద‌రు బాల‌య్య‌లు ఉంటారా ? లేదా ఒకే పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందా ? అన్న‌ది మాత్రం చూడాలి.

థ‌మన్ సంగీతం ఇస్తోన్న ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు. వ‌చ్చే ద‌స‌రాకు ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news