Moviesఅఖండ ఫంక్ష‌న్ వేదిక‌గా బాల‌య్య సంచ‌ల‌నం.. ఆ ఛానెల్లోకి ఎంట్రీ..!

అఖండ ఫంక్ష‌న్ వేదిక‌గా బాల‌య్య సంచ‌ల‌నం.. ఆ ఛానెల్లోకి ఎంట్రీ..!

యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం రాత్రి హైదరాబాద్లో ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేసి ఈ ఫంక్షన్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఫంక్షన్లో అల్లు అర్జున్ వేసిన పంచ్‌లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

 

కోవిడ్ వచ్చినా దేవుడే దిగివచ్చినా తెలుగు ప్రేక్షకుడు త‌గ్గేదేలే అని బన్నీ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పారు. ఇక బాలయ్య సైతం పద్మశ్రీ అల్లు రామలింగయ్యను స్మరిస్తూ ఒక మనిషిగా ఇష్టపడటం వేరు… ఒక నటుడిగా ఇష్టపడటం వేరు అంటూ పెద్దలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ సుకుమార్ గెలవాలి అనుకోకూడదు… పుష్ప గెలవాలి అని అనుకోవాలని తాను ఈ కోవిడ్‌ తర్వాత సినిమా గెలవాలని అనుకుంటున్నా అని చెప్పారు.

అల్లు అర్జున్ అయితే ఈ అఖండ ఓ అఖండ జ్యోతిలా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు వెలుగు ఇవ్వాలని చెప్పారు. ఇక బాల‌య్య‌ మాట్లాడుతూ ఆయ‌న‌కు అల‌వాటు అయిన స్టైల్లోనే ఎన్నో పద్యాలు టక టక వినిపించారు. ఈ క్రమంలోనే భక్తి గురించి మాట్లాడుతూ పలు విషయాలు చెప్పిన బాలయ్య త్వరలోనే తాను భక్తి ఛానల్ ప్రారంభిస్తానని… అందులో నవవిధ భక్తి మార్గాలను వివరిస్తానని చెప్పారు.

ఇక క‌రోనా త‌ర్వాత కుదేల్ అయిన తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాలని ఈ వేదికపై నుంచి బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించిన అఖండ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news