Moviesమూడో పెళ్లికి రెడీ అయిన ఆమీర్‌ఖాన్... ముహూర్తం ఫిక్స్‌..!

మూడో పెళ్లికి రెడీ అయిన ఆమీర్‌ఖాన్… ముహూర్తం ఫిక్స్‌..!

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్ – కిరణ్‌ రావు దంపతులు ఈ ఏడాది ప్రారంభం​లో విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆమీర్ మూడో పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమీర్ – క‌రీనా క‌లిసి న‌టిస్తోన్న లాల్‌సింగ్‌ చద్దా. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆమీర్ త‌న మూడో పెళ్లి విష‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని బీ టౌన్‌లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఆమీర్ త‌న సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇక ఆమీర్ త‌న రెండో భార్య కిర‌ణ్ రావుకు విడాకులు ఇవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఫాతిమా సనా షేక్‌ కారణమని కూడా వార్తలు వ‌చ్చాయి. దంగ‌ల్ సినిమాలో ఆమీర్ ఆమెతో క‌లిసి న‌టించారు. ఫాతిమా స‌నా షేక్ హైద‌రాబాద్‌లోనే జ‌న్మించారు. ఆ సినిమా త‌ర్వాత ఆమె ప‌లు పార్టీల‌కు ముంబై వెళ్ల‌డం.. ర‌హ‌స్యంగా ఆమీర్‌ను క‌లిసి రావ‌డం.. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో కిర‌ణ్ రావు త‌ట్టుకోలేక‌పోయింద‌ట‌.

అయితే తాను ఆమీర్ డేటింగ్‌లో ఉన్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఫాతిమా చెప్పారు. ఇక అమీర్ ఖాన్ సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లోనే రీనా ద‌త్తాను వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత 2001లో వ‌చ్చిన ల‌గాన్ సినిమా షూటింగ్ టైంలో ఆ సినిమా అసిస్టెంట్ ద‌ర్శ‌కురాలు కిర‌ణ్‌రావుతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో 2005లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కిర‌ణ్ రావును పెళ్లి చేసుకునేందుకే ఆమీర్ రీనాకు విడాకులు ఇచ్చాడు. ఇక ఆమీర్ – కిర‌ణ్ రావు దంప‌తుల‌కు ఆజాద్‌ రావ్‌ ఖాన్‌ కొడుకున్నాడు. ఇక ఇప్పుడు ఫాతిమాతో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌డంతోనే ఆమీర్ కిర‌ణ్‌ను సైతం వ‌దిలించుకున్నాడ‌నే ప్ర‌చారం గ‌ట్టిగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news