Movies100 % ప‌క్కా... మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా ఆ బ్యాన‌ర్‌లోనే.. !

100 % ప‌క్కా… మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా ఆ బ్యాన‌ర్‌లోనే.. !

నందమూరి నాలుగో తరం వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడెప్పుడా ? అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి బాల‌య్య కూడా మోక్షు సినిమా ఎంట్రీపై ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తున్నారు. బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలోనే మోక్షు పులోమావిగా న‌టిస్తాడ‌ని ఒక్క‌టే ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత మోక్షు డెబ్యూ మూవీ కోసం క్రిష్‌, పూరి జ‌గ‌న్నాథ్ పేర్లు కూడా వినిపించాయి. మ‌ధ్య‌లో రాజ‌మౌళి పేరు కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది.

స‌రే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ వ‌చ్చే యేడాది ఖ‌చ్చితంగా స్టార్ట్ అవుతుంద‌ని మాత్రం తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు ఎవ‌రు ఉంటార‌న్న‌ది క్లారిటీ అయితే లేదు. క్రిష్ పేరు ఎక్కువుగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మోక్షు తొలి సినిమా నిర్మాత మాత్రం సాయి కొర్ర‌పాటి. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై మోక్ష‌జ్ఞ తొలి సినిమా ఉండ‌బోతోంది. సాయి కొర్ర‌పాటి మోక్షుకు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేశార‌ట‌. ఈ అడ్వాన్స్ ఇచ్చి కూడా నాలుగేళ్లు దాటుతోంద‌ని తెలుస్తోంది.

బాల‌య్య కూడా తొలి సినిమా వారాహి బ్యాన‌ర్‌లోనే ఉంటుంద‌ని వాళ్ల‌కు కూడా మాట ఇచ్చేశాడు. సో నిర్మాత విష‌యంలో మాత్రం ప‌క్కా క్లారిటీ. ఇక ద‌ర్శ‌కుడు విష‌యానికి వ‌స్తే క్రిష్ చారిత్ర‌క క‌థాంశంతో పాటు ప్రేమ‌క‌థ‌ను మిక్స్ చేసి ఓ స్టోరీ అయితే రెడీ చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా. ప్ర‌స్తుతం క్రిష్ ప‌వ‌న్‌తో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త‌ర్వాత మోక్షు సినిమా ఉంటుందా ? లేదా మోక్షు తొలి సినిమా కోసం మ‌రో డైరెక్ట‌ర్ ఫైన‌ల్ అవుతారా ? అన్న‌ది మాత్రం చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news