Moviesఅభిమాని కోసం తార‌క్ వీడియో కాల్‌... ఏం మాట్లాడాడో చూడండి (...

అభిమాని కోసం తార‌క్ వీడియో కాల్‌… ఏం మాట్లాడాడో చూడండి ( వీడియో)

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్‌టీఆర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఎన్టీఆర్‌కు త‌న అభిమానులు అంటే ఎంతో ఇష్టం. అందుకే త‌న సినిమా ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చిన ప్ర‌తిసారి తిరిగి వెళ్లేట‌ప్పుడు అభిమానులు చాలా జాగ్ర‌త్త‌గా వెళ్లాల‌ని చెపుతూ ఉంటాడు. మీ కోసం మీ ఇంట్లో త‌ల్లిదండ్రులు, మీ భార్య బిడ్డ‌లు ఎదురు చూస్తూ ఉంటారు.. వారి కోస‌మైనా జాగ్ర‌త్త‌గా వెళ్ల‌మ‌ని ప‌దే ప‌దే చెపుతూ ఉంటాడు.

ఇక త‌న అభిమానులు ఎక్క‌డ ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా తార‌క్ త‌క్ష‌ణ‌మే స్పందించి వారికి సాయం చేస్తూ ఉంటాడు. అభిమానులు అంటే తార‌క్‌కు చాలా ప్రేమ. అందుకే తార‌క్‌ను కోట్లాది మంది అభిమానులు ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ఇక చావు బ‌తుకుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ అభిమాని చివ‌రి కోరిక‌ను తార‌క్ తీర్చాడు.

తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళీ తారక్‌కు వీరాభిమాని. ముర‌ళీ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆసుప‌త్రిలో చావుబతుకుల మ‌ధ్య‌లో కొట్టుమిట్టాడుతున్నాడు. పరిస్థితి విష‌మంగా ఉండ‌డంతో వైద్యులు అత‌డి చివ‌రి కోరిక తెలుసుకోగా.. త‌న అభిమాని జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సారి మాట్లాడించాల‌ని చెప్పాడు.

ఈ విష‌యం వెంట‌నే తార‌క్‌కు చెప్ప‌గా… వెంట‌నే తార‌క్ వీడియో కాల్ చేసి మురళీతో మాట్లాడి ధైర్యం చెప్పాడు. నువ్వు ధైర్యంగా ఉండు.. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటాడ‌ని తార‌క్ ఆకాంక్షించాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news