Moviesబిగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ర‌జ‌నీకాంత్..ఇక ఫ్యాన్స్ కు పండగే..!!

బిగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ర‌జ‌నీకాంత్..ఇక ఫ్యాన్స్ కు పండగే..!!

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చివ‌రిగా ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్ష‌కులని కాస్త నిరాశ‌ప‌ర‌చింది. ఈ మ‌ధ్య కాలంలో ర‌జ‌నీ సినిమాలు పెద్ద‌గా స‌క్సెస్ కావ‌డం లేదు.దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ రూట్ మార్చారౌ. మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో రాబోతోన్న అన్నాత్తె సినిమా వస్తున్న సంగతి తెలిసిందే..ఇక ఈ సినిమా పై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. తలా అజిత్‌తో వరుసగా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్‌లను కొట్టిన శివ.. ఇప్పుడు రజినీతో మాస్‌ను వేరే లెవెల్‌లో చూపించేందుకు రెడీ అయ్యారు.

రజినీ అన్నాత్తె చిత్రంలో భారీ తారాగణం ఉందన్న సంగతి తెలిసిందే. మీనా, కుష్బూ, కీర్తి సురేష్ ఇలా చాలా మందితో శివ దుమ్ములేపేందుకు రెడీ అయ్యారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.. కానీ కరోనా మహమారి దెబ్బకు లేట్ అయ్యింది. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా నేడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

దీపావళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న చిత్రాన్నివిడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగవంతం చేశారు. ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ర‌జ‌నీకాంత్‌,న‌య‌న‌తార మ‌ధ్య వచ్చే సాంగ్‌ని రేపు సాయంత్రం 6 గంటలు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.తాజాగా ఇచ్చిన ఈ అప్డేట్..రజనీకాంత్ అభిమానుల్లొ ఉత్సాహ నింపుతుంది. ఇక ఈ సినిమా తో రజినీకాంత్ బాస్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు పలువురు ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news