Moviesసెంటిమెంట్ల‌ను న‌మ్ముకుంటోన్న మ‌హేష్‌.. !

సెంటిమెంట్ల‌ను న‌మ్ముకుంటోన్న మ‌హేష్‌.. !

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు మూడు వ‌రుస హిట్ల‌తో కెరీర్‌లోనే ఇప్పుడు తిరుగులేని ఫామ్‌తో ఉన్నాడు. భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి మూడు సినిమాలు మహేష్‌కు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో స‌ర్కారు వారి పాట సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ – కీర్తి సురేష్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న తొలి సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా యూనిట్ కూడా సంక్రాంతికి వ‌స్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై స‌రికొత్త టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి భీమ్లా నాయ‌క్ – రాధే శ్యామ్ ఉన్నా కూడా స‌ర్కారు వారి పాట తీసుకు వ‌స్తామ‌ని ఇది వ‌ర‌కే ఈ సినిమా యూనిట్ చెప్పింది.

అయితే ఇప్పుడు జ‌న‌వ‌రి 7న ఆర్ ఆర్ ఆర్ వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో స‌ర్కారు వారి పాట సంక్రాంతి రేసు నుంచి సైడ్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్‌కు షిప్ట్ అయిపోయింద‌ని అంటున్నారు. మ‌హేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా వ‌చ్చిన పోకిరి సినిమా రిలీజ్ అయిన ఏప్రిల్ 28నే రిలీజ్ చేసే ప్లాన్ జ‌రుగుతోంద‌ట‌. మ‌రి ఈ సెంటిమెంట్ డేట్ మ‌హేష్‌కు మ‌రో హిట్ ఇస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news