Moviesఊహించని హీరోయిన్ ను సెలక్ట్ చేసుకున్న మహేష్ బాబు..బంపర్ ఆఫర్ కొట్టేసిన...

ఊహించని హీరోయిన్ ను సెలక్ట్ చేసుకున్న మహేష్ బాబు..బంపర్ ఆఫర్ కొట్టేసిన పోరి..!

టాలీవుడ్ కి కొత్త అందాలను పరిచయం చేయడంలో మహేష్ బాబు ఎప్పుడు ముందుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన సినిమాతో ఎంతో మందిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసిన ఈయన..తాజాగా ఆ లిస్ట్ లోకి మరో యీరోయిన్ చేర్చుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా అప్‌క‌మింగ్ హీరోయిన్ ఒక‌రు తన నెక్స్ట్ మూవీ లో ఛాన్స్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇంతకి ఆమె ఎవరో తెలుసా..?

మీనాక్షి చౌదరి.. యస్ మోడల్ నుంచి నటిగా మారిన ఈ సుందరి పై మహేష్ బాబు మనసు పారేసుకున్నట్లు తెలుస్తుంది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది ఈ భామ . సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఇక ఈ హ‌ర్యానా సుంద‌రిని త్రివిక్ర‌మ్ మ‌హేశ్‌బాబుతో చేయ‌బోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక చేశాడ‌నే వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మ‌హేశ్ బాబు డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంతో చేస్తున్న స‌ర్కారు వారి పాట షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో.. ఆ తరువాత మరో రెండు బడా సినిమాలను లైన్లో పెట్టుకుని ఉన్నాడు మహేష్ బాబు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news