Moviesఇంటిగుట్టు బయట పెట్టుకుంటున్న "మా"..పాత కక్షలేనా..??

ఇంటిగుట్టు బయట పెట్టుకుంటున్న “మా”..పాత కక్షలేనా..??

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Maa) ఎన్నికలు హోరా హోరీగానే సాగుతుంటాయి. ఈనెల 10 ఆదివారం నాడు మా ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌లు పోటీ పడుతున్నాడు. ప్యానల్ ప్రకటించింది మొదలు.. రెండు ప్యానల్స్‌లోని సభ్యులు ఒకర్నొకరు దూషించుకుంటున్నారు. ఇక మా సభ్యులైతే ఉదయం ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉంటే సాయంత్రానికి మంచు విష్ణు ఫ్యానల్‌లోకి వచ్చేస్తున్నారు.. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతూ మా ప్రెసిడెంట్ ఎన్నికలను ఉత్కంఠగా మార్చేశారు.

జనరల్ ఎలక్షన్స్ మాదిరిగా మానిఫేస్టోలను సైతం రిలీజ్ చేస్తున్నారంటే.. ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు మా ప్రెసిడెంట్ ఎవరో అవుతారని కోట్లలో పందేలు నిర్వహించే స్థితికి వచ్చేశాయి ఈ ఎన్నికలు. అయితే అయితే ‘మా’ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరన్న దానిపై జోరుగా బెట్టింగ్‌ లు సాగుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు మధ్య మాటలైతే తారాస్దాయికి చేరుకున్నాయి. ప్రోఫిషినల్ గా మాట్లాడటం మానేసి వ్యక్తిగత దూషణలకు వచ్చాయి.

ఈ క్రమంలో మా ఇంటి గుట్టును బయట పెట్టుకుంటున్నారు సభ్యులు. గతంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని బయటవాళ్లు అనలేదు. వాళ్లలో వాళ్లే ఆరోపించుకున్నారు. ఆనాటి అంశాలు ఈనాడు తెరమీదకు ఎందుకు వస్తున్నాయి అంటే వాటి కారణం పాత కక్షలే అంటున్నారు సినీ ప్రముఖులు. మా అనేని ఓ ఫ్యామిలీ మేమంతా ఒక్కటే అని చెప్పుకునే వాళ్ళే.. మా… ఇంటిగుట్టు బయటపెడుతున్నారు.. అంతా ఒక్కటే అనేవి మాటలే. ఎన్నికలు వస్తే కానీ వారిలో అసలు కోణం బయటపడాయి. గత ఎన్నికల్లో రెండు వర్గాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్నాయి.. మీరు ఈ వర్గమా? ఆ వర్గమా? అంటూ ఓ పెన్ గానే చర్చకు వస్తున్నారు. ఇందులో కులం, మతం, ప్రాంతం, భాష అన్నీ వచ్చేశాయి. దాచుకోవడానికి ఏమీ లేదు. సాధారణ ఎన్నికలను మించిపోయాయి ఈ మా ఎన్నికలు. మరి చూడాలీ ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news