Moviesమరికొద్దిసేపటిలో ముగియనున్న మా ఎన్నికల పోలింగ్..ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!!

మరికొద్దిసేపటిలో ముగియనున్న మా ఎన్నికల పోలింగ్..ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!!

మహా సంగ్రామంలా జరిగిన్న మూవీ ఆర్టిస్త్ అసీసుయేషన్ ఎన్నికలు మరి కొద్ది సేపటిలో ముగియనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల జ‌నాలు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న మా ఎన్నికలు క్లైమాక్స్‏కు చేరుకున్నాయి. మా ఎన్నికలు రసాభాసగా జరుగుతున్నాయి. ఇరు ప్యానల్ సభ్యుల మధ్య వాగ్వాదాలు, తోపులాట చోటు చేసుకున్నాయి. ఫిల్మ్ న‌గ‌ర్ లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్లో మూడు గ‌దుల్లో మా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ మ‌యిన సంగతి తెలీసందే. కాగా..ఈ ఎన్నికల పోలింగ్ 2 గంటలకు ముగియనుంది.

మొత్తానికి ఇన్ని రోజులు జరిగిన గోడవలు,అరుపులు,రాద్దాంతాలు..సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలకు మరికొద్ది సేప్పటిలో ఎండ్ కార్డ్ పడనుంది. ఇక ముఖ్యంగా ప్రాకాశ్ రాజ్.. మంచి విష్ణు ల మధ్య మాటల యుద్ధం శృతిమించిన్నట్లు కనిపించాయి. అయితే ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..పోలింగ్ కేంద్రంలో మొహన్ బాబు..ప్రకాష్ రాజ్ ఎదుట పడగానే ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. విష్ణు సైతం హై అంకుల్ అంటూ పలకరించడంతో అక్కడ ఉన్నవారంత షాక్ అయ్యారు.

ఇక ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. ఇంట్లో కౌగిలికి ఎన్నో అర్థాలుంటాయి గా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. అంతేకాదు పోలింగ్ మొదట్లో జరిగిన వివాదానికి నేనే కారణం అని చెప్పడం తనకు అసలు నచ్చలేదని చెప్పుతూనే.. పోలింగ్‌లో చిన్న చిన్న గొడవలు జరగడం చాలా కామన్ అంటూ చెప్పారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news