Moviesశోక‌సంద్రంలో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ.... పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ డీటైల్స్‌

శోక‌సంద్రంలో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ…. పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ డీటైల్స్‌

ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్ ఇక లేర‌న్న వార్త వెలు వ‌డ‌డంతో క‌న్నడ సినిమా అభిమానులు మాత్ర‌మే కాదు… క‌న్న‌డ ప్ర‌జ‌లు అంద‌రూ తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. 46 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో క‌న్న‌డనాట టాప్ హీరోగా .. ప‌వ‌ర్‌స్టార్ గా వెలుగొందుతోన్న పునీత్ చిన్న వ‌య‌స్సులోనే మృతి చెందారు. చాతి నొప్పితో బెంగ‌ళూరులోని విక్ర‌మ్ హాస్ప‌టల్లో చేరిన ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందారు.

ఇక పునీత్ రాజ్‌కుమార్ మృతి ప‌ట్ల కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్ సినిమా ప్ర‌ముఖులు ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. 1975 మార్చి 17న పునీత్ జ‌న్మించారు. క‌న్న‌డ కంఠ‌రీవ రాజ్‌కుమార్ – పార్వ‌త‌మ్మ దంప‌తుల‌కు మూడో సంతానంగా పునీత్ జ‌న్మించారు. వీరి పెద్ద కుమారుడు శివ‌రాజ్ కుమార్‌. ఆయ‌న బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో కూడా న‌టించారు.

ఇక రెండో కుమారుడు రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌. మూడో కుమారుడు పునీత్‌. ఇక ఈ ముగ్గురు కుమారుల‌తో పాటు పూర్ణిమ‌, ల‌క్ష్మి అనే సోద‌రిమ‌ణ‌లు కూడా ఉన్నారు. ఇక పునీత్ రాజ్‌కుమార్‌కు భార్య‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news