Moviesశంకర్ సినిమా కోసం మెగా హీరో ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే..షాక్...

శంకర్ సినిమా కోసం మెగా హీరో ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..?

మెగా పవర్‌స్టార్ రాంచరణ్.. టాలీవుడ్ మెగా స్టార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తన దైన స్టైల్లో నటిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. తండ్రి మెగా స్టార్‌, బాబాయ్‌ పవర్‌ స్టార్‌.. వీరిద్దరి లక్షణాలను పుణికి పుచ్చుకున్న హీరో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌… మెగా పవర్ స్టార్ రాంచరణ్..సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతాను అనే స్టైల్ లో ..గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరో ల లిస్ట్ లో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తీయనున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తన బ్యానర్ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని దిల్ రాజు చెప్పిన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకి భారి బడ్జెట్ కేటాయించారు.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో నటించేందుకు గాకు రామ్ చరణ్ ఏకంగా 80 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. అందుకు సిద్దమైన మేకర్స్ ఓకే చెప్పి ఆయన్ను హీరో గా ఫైనల్ చేసారట. నిజానికి రామ్ చరణ్ మార్కెట్ కి ఈ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువే అంటూన్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news